హోమ్ /వార్తలు /సినిమా /

ఔను వారిద్దరూ బ్రేకప్ చేసుకోలేదు.. రూమర్స్‌కు చెక్ పెట్టేసిన యంగ్ కపుల్

ఔను వారిద్దరూ బ్రేకప్ చేసుకోలేదు.. రూమర్స్‌కు చెక్ పెట్టేసిన యంగ్ కపుల్

సిద్ధార్థ, కియారా

సిద్ధార్థ, కియారా

సిద్ధార్థ, కియారా విడిపోయారని జోరుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జరిగిన పార్టీలో వీరిద్దరూ కలిశారు. అంతేకాదు ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

  బాలీవుడ్‌లో ఇటీవలే ఓ జంట బ్రేకప్ చేసుకున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. తిరిగినన్నాళ్లు తిరిగి ఇప్పుడు బోర్ కొట్టేసినట్లు ఉంది విడిపోయారంటూ... పలువురు నెటిజన్స్ కూడా వీరిపై పలు విమర్శలు చేశారు. దీంతో ఈ జంట బ్రేకప్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. వాళ్లెవరో కాదు.. ​బాలీవుడ్‌ మోస్ట్‌ క్యూటెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హ్రోత్రా. వీరిద్దరూ కలిసి షేర్షా మూవీలో నటించారు. దీంతో అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ... త్వరలో ఈ జంట పెళ్లి చేసుకుంటుందని... జోరుగా వార్తలు షికారు చేశాయి. గత కొన్నిరోజులు క్రితం వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. ఈ జంట విడిపోయిందని కూడా అన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి.

  అయితే ఓ పార్టీలో మరోసారి ఈ జంట కలిసింది. ఒకరి కోసం ఒకరు వెయిట్ చూస్తూ కనిపించడంతో... వీరిద్దరూ మధ్య ఎలాంటి గొడవ లేదని.. సిద్, కియారా రిలేషన్ షిప్ స్ట్రాంగ్ అని తేలిపోయింది. సల్మాన్ ఖాన్ సోదరి అర్బిత ఖాన్.. రంజాన్ పండగ సందర్భంగా సినీ సెలబ్రిటీలందరికీ... ఈద్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో కియారా, సిద్దార్థ కలిసి మెరిశారు.దీంతో వీరిద్దరిని చూసిన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కియారాకు ఫోటోలకు ఫోజులిచ్చిన తర్వాత... తన వెనుకాలే వస్తున్న సిద్ధార్థ కోసం వేచి చూసింది. అక్కడకు రాగానే అతడ్ని పలకరించడంతో..కియారాను పట్టుకొని సిద్.. లోపలికి వెళ్లాడు. దీంతో వీరిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారని ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. ‘మీ ఇద్దర్ని ఇలా చూసి చాలా ఆనందం కలిగింది’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరికొందరు నెటిజన్స్ మీడియాపై సీరియస్ అయ్యాడు. కలిసి ఉన్నా విడిపోయారంటూ... వార్తలు సృష్టించి ఏవేవో కథలు అల్లేస్తారంటూ మీడియాపై మండిపడ్డాడు.


  సిద్ధార్థ్ ,కియారా తమ సంబంధాన్ని ఎప్పుడూ అధికారికంగా ప్రకటించనప్పటికీ, వారు చాలా సార్లు వివిధ సందర్భాల్లో కలిసి కనిపించారు. ఇటీవల, కియారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భూల్ భూలయ్యా 2 ప్రమోషన్‌లను ప్రారంభించినప్పుడు ఆమె అద్భుతమైన లుక్ వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో, కియారా ఫార్మల్-చిక్ వైబ్‌లను అందించే బబుల్‌గమ్-పింక్ ఎంసెట్‌లో అద్భుతంగా కనిపించింది. వెంటనే సిద్ధార్థ్ ఈ వీడియోను లైక్ చేశాడు.

  మరోవైపు వీరిద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. కియారా భూల్ భూలయ్యా 2 లో కార్తీక్ ఆర్యన్, టబుతో కలిసి నటించనుంది. ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుణ్ ధావన్, నీతూ కపూర్, అనిల్ కపూర్, ప్రజక్తా కోలి , మనీష్ పాల్‌లతో పాటు ఆమె పైప్‌లైన్‌లో జగ్ జగ్ జీయో కూడా ఉంది. ఇది కాకుండా, కియారా గోవింద నామ్ మేరాలో విక్కీ కౌశల్ భూమి పెడ్నేకర్‌లతో స్క్రీన్ స్పేస్‌ను కూడా పంచుకుంటుంది. మరోవైపు, సిద్ధార్థ్ మల్హోత్రాకు కూడా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. పుష్ప స్టార్ రష్మిక మందన్నతో కలిసి మిషన్ మజ్నులో కనిపించనున్నాడు. మరోవైపు కరణ్ జోహార్ మూవీ యోధ సినిమాలో కూడా సిద్ధార్థ నటిస్తున్నాడు. అజయ్ దేవగన్ , రకుల్ ప్రీత్ సింగ్‌లతో కలిసి థాంక్స్ గాడ్‌లో కూడా సిద్ నటిస్తున్నాడు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Bollywood, Kiara advani, Kiara adwani

  ఉత్తమ కథలు