కియారా అద్వానీ సూపర్ స్టార్‌గా ఎదగడానికి ఈ లక్షణాలే కారణమా..

Kiara Advani : ప్రస్తుతం బాలీవుడ్‌లోని క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. అందం, అభినయం మాత్రమే కాదు తన స్టైల్, బోల్డ్‌నెస్‌తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది ఈ యంగ్ బ్యూటీ.

news18-telugu
Updated: September 21, 2019, 10:25 AM IST
కియారా అద్వానీ సూపర్ స్టార్‌గా ఎదగడానికి ఈ లక్షణాలే కారణమా..
Instagram/kiaraaliaadvani
  • Share this:
Kiara Advani : ప్రస్తుతం బాలీవుడ్‌లోని క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. అందం, అభినయం మాత్రమే కాదు తన స్టైల్, బోల్డ్‌నెస్‌తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. అందం ఉంటేనే హీరోయిన్. వెండి తెరపై రాణించాలంటే సొగసులతో సెగలు పుట్టించాలి. సోయగాలతో హోరెత్తించాలి. తళుకుబెళుకులతో కులుకులతో అలరించాలి. ఇవన్నీ ఉన్న వారే వెండితెరను ఏలుతారు. కియారా అద్వానీలో ఈ క్వాలిటీస్‌ పుష్కలంగా ఉన్నాయి.  తొలి సినిమాతోనే సక్సెస్‌ బోణీ కొట్టి మలి సినిమాతోనూ అదే బాటలో పయనిస్తూ తనకెదురే లేదంటున్న కియారా.. తెలుగులో హిట్టైయిన 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' సక్సెస్‌తో బాలీవుడ్‌ మోస్ట్ వాంటెట్ హీరోయిన్‌ అయింది. అయితే తనుకున్న లక్షణాలే తనను ఆ స్థాయిలో నిలబెట్టగలిగాయి అంటున్నారు సినీ విశ్లేషకులు .. కొంత మంది హీరోయిన్లకు అందముంటే నటన రాదు. మరికొందరికి నటన వస్తే అందం ఉండదు. ఈ రెండూ ఉన్న వారు ఎత్తు తక్కువగా ఉంటారు. దక్షిణాదిన చాలా మంది హీరోయిన్లలో ఈ లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఉత్తరాది ముద్దుగుమ్మ కియారా అద్వానీలో మాత్రం, అందం, నటన, ఎత్తు అన్నీ సమపాళ్ళలో ఉంటాయి.
అంతేకాక పంచువాలిటీ మెయింటన్ చేసే కియారా సమయానికి సెట్‌లో అందుబాటులో వుంటుందట. స్వతాహాగా కథక్‌ డ్యాన్సర్ అయిన కియారా తన నాట్యంతో కూడా ఆకట్టుకోగలదని టాక్. అయితే షూటింగ్ సమయాలలో కూడా ఇంటి భోజనమే చేస్తుందట. కియారా ఆలా చెయ్యడానికి కూడా ఒక రీజన్ ఉందట.. తన భోజనం ఖర్చు ఒకరిపై రుద్దడానికి ఇష్టపడదట కియారా.. అంతేకాక ఇంటి భోజనం హెల్త్ కి మంచిది అని నమ్ముతుందట. షూటింగ్ సమయాలలో తనకు తెలిసిన విషయాలను బాహాటంగా చెప్పే కియారా, తనకి తెలియని విషయాల గురించి అస్సలు మాట్లాడదని టాక్. అందంతో పాటు అణకువ ఆమెసొంతం అంటున్న సినీజనాలు ఈ క్వాలిటీస్‌తోనే కియారా దక్షిణాదికి అందరికీ ఇష్టురాలైపోయింది వాపోతున్నారు . దాంతో వరుస అవకాశాలు ఆమెను పలకరిస్తున్నాయి అంటున్నారు. ప్రస్తుతం ఇటు దక్షిణాదినా, అటు ఉత్తరాదినా బిజీగా ఉంది కియారా అద్వానీ. ఈ భామ ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో 'లక్ష్మీ బాంబ్', కార్తిక్ ఆర్యన్‌తో 'భూల్ భులయ్యా' సినిమాలు చేస్తోంది. 
View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on
First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading