హోమ్ /వార్తలు /సినిమా /

మీటూపై కియార అద్వానీ సంచలన వ్యాఖ్యలు.. అసలేం మారలేదంటూ..

మీటూపై కియార అద్వానీ సంచలన వ్యాఖ్యలు.. అసలేం మారలేదంటూ..

కియారా అద్వానీ (Instagram/Photo)

కియారా అద్వానీ (Instagram/Photo)

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో మీటూ ఉద్యమం ఊపుందుకుంది. దీనివల్ల ఇండస్ట్రీలో ఉన్న బాగోతం బయటపడింది. తాజాగా ఈ విషయమై కియారా అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో మీటూ ఉద్యమం ఊపుందుకుంది. దీనివల్ల ఇండస్ట్రీలో ఉన్న బాగోతం బయటపడింది. హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమం బాలీవుడ్‌ నుంచి ఆ తర్వాత అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ వరకు వ్యాపించింది. గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చాలా మంది హీరోయిన్లు ఎంతో ధైర్యంగా బయటకు వచ్చి తమకు జరిగిన లైంగిక వేధింపులను ధైర్యంగా  వివరించారు. ముందుగా తనూశ్రీ దత్త.. ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై చేసిన ఆరోపణలతో మీటూ ఉద్యమం ఊపందుకుంది. తాజాగా మీటూ ఉద్యమం పై ప్రముఖ నటి కాజోల్ ఇండస్ట్రీకి మంచే జరిగిందన్నారు. దీంతో చాలా మంది దర్శకుులు, హీరోలు మహిళలతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. దీనిపై మరో హీరోయిన్ కియార మాట్లాడుతూ.. మీటూ వల్ల పెద్ద మార్పేం రాలేదన్నారు. మీటూ తర్వాత ప్రపంచం మారిపోలేదు. మనం ఇంకా మీటూ తర్వాతి దశకు చేరుకోలేదని వ్యాఖ్యానించింది. మీటూ ఫలితం ఇంకా రాలేదని కియార వ్యాఖ్యానించింది. కియార ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు త్వరలో ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నట్టు ప్రచారం జరిగింది.

First published:

Tags: Bollywood, Hindi Cinema, Kiara advani, Tollywood

ఉత్తమ కథలు