Kiara Advani : నేను ఆ టైప్ కాదు.. నాదంతా ఓల్డ్ స్టైల్ రొమాన్స్ : కియారా అద్వానీ..

కియారా అద్వానీ Photo : Instagram

Kiara Advani : కియారా అద్వానీ.. 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Share this:
    కియారా అద్వానీ.. 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ ఒక్క సినిమాతో అమ్మడికి స్టార్ హీరోయిన్ గుర్తింపు అభించింది ఇక్కడ. ఇక అదే ఊపుతో వెంటనే రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ సినిమాలో మంచి నటనతో పాటు అందచందాలు తగిన మోతాదుల్లో ఆరబోసిన.. సినిమాలో కంటెంట్ సరిగా లేక బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. దీంతో ఆ సినిమా తర్వాత నుండి తెలుగులో మరో సినిమా చేయలేదు కియారా. కానీ హిందీలో మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ.. అదరగొడుతోంది. ఈ బ్యూటీ హిందీలో 'లస్ట్ స్టోరీస్' అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్‌లో కాస్తా ఘాటుగానే నటించి అందరి దృష్టిని ఆకర్షించింది కియారా. ఆ తర్వాత అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌లో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఈ సినిమాతో కియారాకు హిందీలో విపరీతంగా ఆఫర్స్ వచ్చాయి. అందులో భాగంగాతో ఓ సినిమా అక్షయ్ కుమార్‌తో మరో సినిమాను కార్తిక్ ఆర్యన్‌తో చేస్తోంది. కియారా ప్రస్తుతం 'భూల్ భులయ్యా 2'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక అది అలా ఉంటే.. కియారా ఇటీవల 'ఇందూకి జవానీ' అనే సినిమా చేసింది. ఈ సినిమా తాజాగా విడుదలైంది.









    View this post on Instagram






    A post shared by KIARA (@kiaraaliaadvani)





    ఈ సినిమాలో కియారా కాస్తా బోల్డ్ పాత్రలో నటించింది. కియారా ఈ సినిమాలో డేటింగ్ యాప్స్‌ను నమ్మి మోసపోయే అమ్మాయి పాత్రలో కనిపించింది. ఈతరం అమ్మాయిలు మరీ ఇలా తయారయ్యారా. అనిపించేలా ఉంటుంది కియారా పాత్ర. ఇక ఇదే ట్రాన్స్‌లో ఉన్న అభిమానులు మరి కియారా ఎలాంటి అమ్మాయి? అంటూ ఈ సమయంలో చాలా మంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కియారా క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా కియారా "ఇందూకి జవానీ సినిమాలో నటించినా కూడా.. నేను ఆ సినిమాలో ఉండే ఇందూ టైప్ మాత్రం అస్సలు కాదు. ఇందూ ఈ తరం రొమాంటిక్ లైఫ్‌స్టైల్ కలిగి ఉన్న అమ్మాయి. కానీ నా రొమాంటిక్ లైఫ్‌స్టైల్ మాత్రం చాలా ఓల్డ్ స్టైల్ అంటోంది. అంతేకాదు నా రొమాంటిక్ ఆలోచనలు కూడా ఓల్డ్‌గా ఉంటాయని అంటోంది.

    ఇక ఈ భామ నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. షేర్షా, జగ్ జగ్ జియో వంటి హిందీ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు కియారా తెలుగులో మరోసారి రామ్ చరణ్ సరసన నటిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తోన్న ఆచార్యలో కియారా, రామ్ చరణ్ సరసన నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కాజల్ కూడా నటిస్తోంది. ఆమె చిరంజీవికి జంటగా కనిపించనుంది. ఇక కియారా నటించిన లక్ష్మి సినిమా ఓటీటీలో విడుదలై తుస్సుమంది. అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో కాంచనకు రీమేక్ ‌గా వచ్చిన ఈ "లక్ష్మి" ఈ నెల 9న హాట్ స్టార్ లో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
    Published by:Suresh Rachamalla
    First published: