సూపర్ స్టార్ మహేష్, పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు తర్వాత ముందుగా అనుకున్న ప్రకారం వంశీతో ఓ మాఫియా బ్యాగ్రౌండ్లో ఓ సినిమా చేయాలి. కానీ మహేష్ ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టి విజయ్ దేవరకొండతో సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో ఓ సై అన్నాడు. ఈ విషయాన్ని పరశురామ్ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ కన్ఫామ్ చేశాడు. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ ఫైనల్‌గా ఓకే అన్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రానుంది. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ ఉన్న సందర్బంలో ఈ సినిమా అక్టోబర్నుండి షూటింగ్‌కు వెళ్లే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో మహేష్ కోసం అప్పుడే హీరోయిన్ ని వెతికే పనిలో పడింది చిత్ర బృందం. అందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ సరసన మొదట హిందీ నటి కియారాను తీసుకోవాలనీ చూశారట.అందులో భాగంగా ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం. ఐతే ఈ ప్రాజెక్ట్ ని కియారా సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేను అని చెప్పేసిందట. అంతేకాదు మరో రెండేళ్లవరకు తన క్యాలండర్లో ఖాళీ లేదని ఆమె స్పష్టం చేసిందట.
కియారా తెలుగులో గతంలో మహేష్‌తో భరత్ అనే నేను, ఆ తర్వాత రామ్ చరణ్‌తో వినయ విధేయ రామలో నటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం కియారా అక్షయ్ హీరోగా వస్తున్న లక్ష్మీ బాంబ్, ఇందూ కి జవానీ, భూల్ భూలయ్య2లో నటిస్తోంది. అయితే కియారా నో అనడంతో మహేష్ సరసన నటించే మరో అమ్మాయి ఏవరైతే బాగుంటారనీ ఆలోచిస్తున్నారట. అందులో భాగంగా కీర్తి సురేష్‌ను కూడా చిత్రబృదం పరిశీలిస్తుందట. తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఒరు అదార్ లవ్ అంటూ ఓ కన్ను కొట్టి దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్‌ను కూడా చిత్రబృందం పరిశీలిస్తుందట. చూడాలీ మరి చివరకు ఏ హీరోయిన్ మహేష్‌తో రొమాన్స్ చేయనుందో..