పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన మెగా హీరోయిన్..

ఇక పూరీ జగన్నాథ్ సైతం పవన్ పొలిటికల్ ఇమేజ్‌కు సరిపోయే కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ఇది వరకే ఈ కాంబినేషన్‌లో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి సినిమాలు వచ్చాయి.

పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుసబెట్టి సినిమాలను చేస్తున్నాడు.

 • Share this:
  పవన్ కళ్యాణ్, ఓ వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటూనే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించాడు. అందులో భాగంగా MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి  ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో నివేదా థామస్‌, అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డేను అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో  పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు రీసెంట్‌గా కొబ్బరికాయ కొట్టారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్  హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు. కాగా పవన్ సరసన ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరూ కలిసి నటిస్తే ఈ జంట మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుందని అభిమానులు భావించారు. అయితే వాళ్లకి నిరాశను కలిగిస్తూ పవన్‌తో సినిమాకు కియారా నో చెప్పేసింది. కియారా ప్రస్తుతం హిందీలో సూపర్ బిజీగా ఉంది. దీంతో డేట్లు ఖాళీ లేవని చెప్పిందట. కియారా ఇంతకు ముందు మహేష్ భరత్ అనే నేను, రామ్ చరణ్ వినయ విధేయ రామలో నటించిన సంగతి తెలిసిందే.

  Kiara Advani says no for Pawan Kalyan and Krish new movie,kiara advani,pavan kalyan movies,pavan kalyan new movie update,ram charan new movie,vinaya vidheya rama movie,pawan kalyan new movie update with dilraju,vinaya vidheya rama ram charan new movie,pawan kalyan,pawan kalyan acting remake movie pink,vinaya vidheya rama kiara advani vivek oberoi,penalty for pawan kalyan,pawan kalyan remake movie pink,kiara advani and ram charan love scenes
  Twitter


  కియారా ప్రస్తుతం అక్షయ్ కుమార్ లక్ష్మి బాంబ్‌తో పాటు చంద్రముఖికి సిక్వెల్‌గా కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో హిందీలో వస్తోన్న ఓ సినిమా వస్తోంది. ఆసినిమాలో కియారా హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు తెలుగులో కియారా మహేష్‌తో వంశీ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పిందని సమాచారం. దాంతో పవన్ సరసన వాణీ కపూర్‌ను ఎంపిక చేసే ఆలోచనలో క్రిష్ వున్నాడని తెలుస్తోంది. వాణీ కపూర్, నాని సరసన 2014లో వచ్చిన 'ఆహా కల్యాణం'లో మెరిసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం ప్రతిష్టాత్మికంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై తెరకెక్కుతోంది. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించనున్నాడు.

  Kiara Advani says no for Pawan Kalyan and Krish new movie,kiara advani,pavan kalyan movies,pavan kalyan new movie update,ram charan new movie,vinaya vidheya rama movie,pawan kalyan new movie update with dilraju,vinaya vidheya rama ram charan new movie,pawan kalyan,pawan kalyan acting remake movie pink,vinaya vidheya rama kiara advani vivek oberoi,penalty for pawan kalyan,pawan kalyan remake movie pink,kiara advani and ram charan love scenes
  Twitter
  Published by:Suresh Rachamalla
  First published: