Anjali : కియారా అద్వానీ, సమంత బాటలో అంజలి...

Anjali : ఈ మధ్యకాలంలో చాలా మంది కథానాయికలు సినిమాలు కాకుండా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. ఇపుడు అదే రూట్లో అంజలి కూడా ఓ వెబ్ సీరిస్‌లో నటించనుందని సమాచారం.

news18-telugu
Updated: September 6, 2019, 12:27 PM IST
Anjali :  కియారా అద్వానీ, సమంత బాటలో అంజలి...
Instagram
  • Share this:
అంజలి... 'షాపింగ్‌మాల్' సినిమాలో అదిరిపోయే నటనతో అందరినీ అబ్బురపరిచిన విషయం తెలిసిందే. 'షాపింగ్ మాల్' సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ మురుగదాస్ నిర్మించిన 'జర్నీ'లో చక్కటి హావభావాలతో అంజలి అందరి మనసుల్నీ దోచుకుంది. ఆ తర్వాత  సీతగా... తెలుగులో  2013లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో అమాయకంగా కనిపిస్తూ.. అంజలి చేసిన యాక్టింగ్‌కు తెలుగు వారందరూ ఫిదా అయ్యారు. తర్వాత రవితేజతో 'బలుపు' 'గీతాంజలి', 'చిత్రంగద' వంటి హారర్ సినిమాలలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించింది అంజలి. అది అలా ఉంటే.. అంజలి డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి అడుగుపెడుతోంది.




 



View this post on Instagram




 

#sunday 🐥


A post shared by Anjali (@yours_anjali) on





ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ.. నెట్‌ఫ్లిక్స్‌  తమిళంలో ఓ వెబ్‌ సిరీస్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ సిరీస్‌కు పలువురు దర్శకులు.. వివిధ కథలతో ఓ సినిమా లాగా ఉండే యాంథాలజీని రూపోందిస్తున్నారు.  దీనికోసం నెట్‌ప్లిక్స్.. ప్రముఖ తమిళ దర్శకులు గౌతమ్‌ వాసుదేవ్ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్, విఘ్నేష్‌ శివన్‌‌ను ఎంచుకుంది. వీరు ఒక్కోక్కరూ ఓ ఎపిసోడ్‌ను డైరెక్ట్ చేయనున్నారు. కాగా ఈ కథలన్ని పరువు హత్యల నేపథ్యంలో సాగనున్నాయని సమాచారం. వీటిలో విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించే భాగంలో అందాల అంజలి, హిందీ నటి కల్కీ కొచ్లిన్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. కాగా ఇలాంటిదే గతంలో  హిందీ హీరోయిన్ కియారా కూడా ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్‌ తర్వాత కియారాకు హీరోయిన్‌గా వరుస అవకాశాలొచ్చాయి. అదే బాటలో మరో ప్రముఖ తెలుగు హీరోయిన్ సమంత కూడా నడుస్తోందని... ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
First published: September 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading