news18-telugu
Updated: September 13, 2019, 5:59 PM IST
Instagram
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్.. తేజ 'లక్ష్మీ కళ్యాణం'తో టాలీవుడ్‌కు పరిచయమైనా.. కృష్ణ వంశీ 'చందమామ' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఇక అప్పటినుండి.. దాదాపు ఓ దశాబ్దం కాలంగా తెలుగువారిని తన అందచందాలతో అలరిస్తూనే ఉంది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు పొంది ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే కేరిర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది కాజల్. అది అలా ఉంటే.. ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావండం.. ఇంటర్నెట్ సేవలు కూడా అందరికి అనుకూల ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు ఇండియా బాట పట్టిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ఇండియాలో ప్రస్తుతం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు చాలా ప్రాచుర్యం పొందాయి. అంతేకాదు.. ఈ సంస్థలు సొంతంగా కాంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటినే మనం ఒరిజనల్స్‌గా పిలుస్తున్నాము.
ఈ ఒరిజనల్స్‌లో హిందీలో కియారా నుండి రాధికా ఆప్టే వరకు వెబ్ సిరీస్‌లు చేస్తూ అటూ డిజిటల్లో ఇటూ సినిమాల్లో మంచి అవకాశాలు పొందుతున్నారు. తెలుగులో కూడా ఇలాంటీ కల్చర్ ఇప్పుడిప్పుడే వస్తోంది. ఆ మధ్య జగ్గుబాయ్ ఓ వెబ్ సీరిస్‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రుపొందిస్తున్న ఓ వెబ్‌సిరీస్‌లో అందాల కాజల్ నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది. కాగా మొదట తమిళంలో తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్ ఆ తర్వాత తెలుగులోకి కూడా విడుదల కానుంది. కాగా మరో తెలుగు టాప్ హీరోయిన్ సమంత కూడా వెబ్‌సిరీస్‌లో నటించబోతోందంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Published by:
Suresh Rachamalla
First published:
September 13, 2019, 5:54 PM IST