హోమ్ /వార్తలు /సినిమా /

ఊర్వశియా లేక కియారా... బన్నీ రొమాన్స్ ఎవరితో..

ఊర్వశియా లేక కియారా... బన్నీ రొమాన్స్ ఎవరితో..

ఊర్వశి, కియారా, బన్ని Photo : Twitter

ఊర్వశి, కియారా, బన్ని Photo : Twitter

అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  ‘పుష్ప’ అంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసి సంచలనం స‌ృష్టించింది చిత్రబృందం. కాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ రఫ్ అండ్ రస్టిక్ లుక్ కేక పెట్టిస్తున్నాడు. ఓ షేడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉండనుందట. మూమూలుగా సుకుమార్ సినిమాలో ఐటెమ్ సాంగ్స్ అదిరిపోతాయి. అందులో భాగంగా ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశాడట సుకుమార్. అయితే ఈ సాంగ్‌ను ఓ బాలీవుడ్ భామపై చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సాంగ్‌లో కియారా నటిస్తుందని మొన్నటి దాకా వార్తలు రాగా.. తాజాగా మరో హాట్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఏవరితో బన్ని డాన్స్ చేయనున్నాడనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా అందాల తార.. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న నటిస్తోంది. ఎప్పటిలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ప్యాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి కూడా నటిస్తున్నాడు. ఆయన ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

First published:

Tags: Allu Arjun, Kiara advani, Pushpa Movie

ఉత్తమ కథలు