Kiara Advani: బట్టలు లేకుండా ఫోటో షూట్ చేయడంపై కియారా పై ట్రోల్స్..

కియారా న్యూడ్ ఫోటో షూట్ (Image: Kiara Advani/Twitter)

Kiara Advani | తాజాగా కియారా డబూ రత్నానీ నిర్వహించే ఫోటో షూట్‌లో ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా  కేవలం ఆకు చాటున దాగిన కియారా ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఈ ఫోటో షూట్ పై సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

  • Share this:
    బాలీవుడ్‌లో ‘ఫగ్లీ’ సినిమాతో తెరంగేట్రం చేసిన కియారా అద్వానీ.. ఆ తర్వాత భారత మాజీ క్రికెటర్ ‘ఎం.ఎస్.దోని’ జీవిత కథపై తెరకెక్కించిన ‘ఎం.ఎస్.దోని ది అన్‌టోల్డ్ కహాని’ సినిమాతో కథానాయికగా బ్రేక్ వచ్చింది. తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆతర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ చిత్రం తర్వాత కియారా తన దృష్టిని కేవలం హిందీ సినిమాలకే పరిమితం చేసింది.గతేడాది షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’ సక్సెస్‌తో బాలీవుడ్‌లో జెండా పాతింది.  ఆ తర్వాత ఇయర్ ఎండింగ్‌లో అక్షయ్ కుమార్‌తో చేసిన ‘గుడ్ న్యూస్’తో మరో హిట్‌ను తన అకౌంట్‌లో వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వ రుస కమిట్‌మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది కియారా. అప్పట్లో ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించింది.

    kiara advani hot,kiara advani age,kiara advani song,kiara advani facts,kiara advani latest,kiara advani birthday,kiara advani interview,kiara advani life story,kiara advani kabir singh,కియారా అద్వానీ భరత్ అను నేను,కియారా అద్వానీ,కియారా అద్వానీ హాట్ ఫోటో షూట్,కియారా హాట్,కియారా అద్వానీ బర్త్ డే, కియరా అద్వానీ హాట్
    ఆకు చాటు పిందె తడిసె...కియారా అద్వానీ (Twitter/Photo)


    తాజాగా కియారా డబూ రత్నానీ నిర్వహించే ఫోటో షూట్‌లో ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా  కేవలం ఆకు చాటున దాగిన కియారా ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. కియారా చేసిన ఈ న్యూడ్ ఫోటో షూట్ పై నెటిజన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులు కియారాను సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. కెరీర్‌ పీక్ స్టేజ్‌లో ఉన్న ఈ సమయంలో ఇలాంటివి అవసరమా అని అడుగుతున్నారు. మొత్తానికి ఎవరేమనుకున్నా.. తనదైన శైలిలో కియారా మాత్రం రెచ్చిపోతూనే ఉంది.

    ఒంటిపై నూలు పోగు లేకుండా కియారా అద్వానీ ఫోటో షూట్ (Image: Kiara Advani/Twitter)


    ప్రస్తుతం కియారా అద్వానీ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. ‘కాంచన’ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే 'ఇందూ కీ జవానీ' అనే మరో చిత్రం లోనూ ఆమె నటిస్తోంది. . ఇదే ఆమెకు ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమాలో ఘజియాబాద్‌ అమ్మాయి ఇందూ గుప్తా పాత్రలో నటిస్తోంది కియారా. డేటింగ్‌ యాప్‌ల నేపథ్యంతో అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: