• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KIARA ADVANI NEW YEAR CELEBRATIONS WITH SIDHARTH MALHOTRA AT MALDVIES TA

Kiara Advani: ప్రియుడితో కలిసి మాల్దీవుల్లో కియారా అద్వానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Kiara Advani: ప్రియుడితో కలిసి మాల్దీవుల్లో కియారా అద్వానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

కియారా అద్వానీ (Instagram/Photo)

Kiara Advani New Year Celebrations | న్యూ ఇయర్ వేడుకలకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా చాలా ఈవెంట్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక కియారా అద్వానీ కొత్త యేడాది వేడుకలను తన ప్రియుడుతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Share this:
    Kiara Advani New Year Celebrations | న్యూ ఇయర్ వేడుకలకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా చాలా ఈవెంట్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఐతే.. సెలబ్రిటీలు మాత్రం కొత్త యేడాది వేడుకలను వివిధ ప్రాంతాల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా వాళ్లకు మాల్దీవులపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే కాజల్ అగర్వాల్, రానా దగ్గుబాటితో పాటు లేెటెస్ట్‌గా నిహారిక, చైతన్య దంపతులు తమ హనీమూన్‌కు మాల్దీవులనే ఎంచుకున్నారు. ఈ యేడాది న్యూ ఇయర్ వేడుకలను అక్కడే సెలబ్రేట్ చేసుకోనున్నారు. తాజాగా కియారా అద్వానీ కూడా కొత్త యేడాది వేడుకల కోసం మాల్దీవులనే ఎంచుకుంది. అక్కడ తన ప్రియుడు సిద్ధార్ధ్ మల్హోత్రతో కలిసి 2021కు వెల్‌కమ్ చెప్పనుంది. ఈ బుధవారం ఉదయము కియారా అద్వానీ తన ప్రియుడు సిద్దార్ధ్ మల్హోత్రతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది.

    కియారా అద్వానీ ఇన్ని రోజులు తన ప్రియుడు ఎవరనేది సస్పెన్స్‌లో ఉంచింది. తాజాగా న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్దార్ధ్ మల్మోత్రతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాలకు చిక్కింది. అక్కడ ఓ వారం రోజుల పాటు వీళ్లిద్దరు కలిసి ఎంజాయ్ చేయనున్నారట. గతంలో వీళ్లిద్దరు 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆఫ్రికాకు వెళ్లారు. అపుడు వీళ్లిద్దరు ఎవరి కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఈ సారి మాత్రం మీడియా కంట పడిపోయారు. దీంతో ఇన్ని రోజులుగా వీళ్లిద్దరి మధ్య ఉన్న రిలేషన్ బట్టబయలైంది.

    ఫ్రియుడు సిద్ధార్ధ్ మల్హోత్రతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన కియారా (Instagram/Photo)


    కియారా అద్వానీ విషయానికొస్తే..  'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ ఒక్క సినిమాతో అమ్మడికి స్టార్ హీరోయిన్ గుర్తింపు అభించింది ఇక్కడ. ఇక అదే ఊపుతో వెంటనే రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ సినిమాలో మంచి నటనతో పాటు అందచందాలు తగిన మోతాదుల్లో ఆరబోసిన.. సినిమాలో కంటెంట్ సరిగా లేక బాక్సాఫీస్ దగ్గర సరిగా పర్ఫామ్ చేయలేదు. దీంతో ఆ సినిమా తర్వాత నుండి తెలుగులో మరో సినిమా చేయలేదు కియారా. కానీ హిందీలో మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ.. అదరగొడుతోంది.

    ఫ్రియుడు సిద్ధార్ధ్ మల్హోత్రతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన కియారా (Instagram/Photo)


    ఈ బ్యూటీ హిందీలో 'లస్ట్ స్టోరీస్' అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్‌లో కాస్తా ఘాటుగానే నటించి అందరి దృష్టిని ఆకర్షించింది కియారా. ఆ తర్వాత అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌ ‘కబీర్ సింగ్’లో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఈ సినిమాతో కియారాకు హిందీలో విపరీతంగా ఆఫర్స్ వచ్చాయి. అందులో భాగంగా ఓ సినిమా అక్షయ్ కుమార్‌ ‘లక్ష్మి’ సినిమాలో నటించింది.  కియారా ప్రస్తుతం 'భూల్ భులయ్యా 2'.. 'షేర్ షా'.. 'సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక అది అలా ఉంటే.. కియారా ఇటీవల నటించిన 'ఇందూకి జవానీ' అనే సినిమా చేసింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. మరోవైపు ఈ యేడాది ఆకు చాటు న్యూడ్ ఫోటో షూట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: