Kiara Advani: కియారాకు మరో బంపర్ ఆఫర్... దశ తిరిగినట్టే...

Kiara Advani: కబీర్ సింగ్ సక్సెస్ సౌత్‌లోనూ ఆమెకు మరో క్రేజీ ఛాన్స్ తెచ్చిపెట్టే అవకాశం ఉందని తమిళ సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: August 7, 2019, 7:31 PM IST
Kiara Advani: కియారాకు మరో బంపర్ ఆఫర్... దశ తిరిగినట్టే...
కియారా అద్వానీ(ఫైల్ ఫోటో)
  • Share this:
అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో అందాల భామ కియారా అద్వానీ దశ తిరిగిపోయింది. అప్పటివరకు బాలీవుడ్‌లో యావరేజ్ హీరోయిన్ రేంజ్‌లో ఉన్న కియారాకు... కబీర్ సింగ్ సక్సెస్‌తో ఒక్కసారిగా ఆఫర్లు పెరిగిపోయాయి. కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ తరువాత బాలీవుడ్ స్టార్ మూవీ మేకర్లు సైతం ఈ ముద్దుగుమ్మ కాల్షీట్స్ కోసం క్యూ కడుతున్నారు. అమ్మడితో సినిమాలు ఫిక్స్ చేసుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఈ రేంజ్‌లో బిజీ అవుతున్న కియారా అద్వానీ ఇప్పుడప్పుడే దక్షిణాది సినిమాల్లో మళ్లీ నటించే అవకాశం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది.

అయితే కబీర్ సింగ్ సక్సెస్ సౌత్‌లోనూ ఆమెకు మరో క్రేజీ ఛాన్స్ తెచ్చిపెట్టే అవకాశం ఉందని తమిళ సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే కియారా కోలీవుడ్ ఎంట్రీ అదిరిపోతుందని సినీవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు కియారా సౌత్ లో కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే నటించింది. విజయ్ వంటి స్టార్ హీరోతో కలిసి ఆమె కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తే... అమ్మడు తమిళంలోనూ క్రేజీ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading