లస్ట్ స్టోరీస్ తెలుగులో రీమేక్ .. కియారా పాత్రలో రామ్ చరణ్ భామ..

‘ఆమె’ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా షాక్‌కు గురిచేసింది అందాల అమలా పాల్.

news18-telugu
Updated: October 12, 2019, 8:49 AM IST
లస్ట్ స్టోరీస్ తెలుగులో రీమేక్ .. కియారా పాత్రలో రామ్ చరణ్ భామ..
‘ఆమె’ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా షాక్‌కు గురిచేసింది అందాల అమలా పాల్.
  • Share this:
‘ఆమె’ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా షాక్‌కు గురిచేసింది అందాల అమలా పాల్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకొనప్పటికీ.. సౌత్ సినీ ఇండస్ట్రీ నుండే కాకుండా.. ప్రముఖ బాలీవుడ్ దర్శక , నిర్మాతలు అమల పాల్‌పై ప్రశంసల జల్లులు కురిపించారు. 'ఆమె' సినిమాలో అమలా పాల్ బోల్డ్, బ్యూటిఫుల్‌గా ఉన్నారని ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మెచ్చుకున్నవిషయం తెలిసిందే. అది అలా ఉంటే హిందీలో సూపర్ హిట్టైన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ ను తెలుగులో రీమేక్ చేయాలని  ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ  స్క్రూవాలా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో ముఖ్య పాత్రలో  ‘ఆమె’తో అందర్ని ఆకర్షించిన అమలా పాల్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
 View this post on Instagram
 

Amala Paul signs the telugu remake of "Lust Stories" ! #Cinema #AmalaPaul #LustStories #Telugu #SunNews #SunNewsSocial


A post shared by Sun News Tamil (@sunnews) on

కియారా, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఎరోటిక్ 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌కు  హిందీలో విపరీతమైన ప్రేక్షాధారణ లభించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ లీడ్ రోల్‌లో నటించిన ఈ సిరీస్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‌ను తెలుగులో తీయాలని నిర్మాత రోని స్క్రూవాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగా.. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో పాటు నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్‌లు ఈ సిరీస్‌లోని నాలుగు కథలను డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం. ఇందులో జగపతిబాబు కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారట. 
View this post on Instagram
 

A lavish lust for life! 🌸 . . #keralatimes #allepey #vacaymode #gypsysoul #glowfromwithin #happyvibes #AmalaPaul


A post shared by Amala Paul ✨ (@amalapaul) on
First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading