హాట్ ఫోటో షూట్‌లతో కేక పెట్టిస్తోన్న కియారా అద్వానీ..

Kiara Advani : వరుసగా ఆఫర్స్ అందుకుంటూ మంచి ఊపు మీదున్న కియారా.. వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

news18-telugu
Updated: October 17, 2019, 1:47 PM IST
హాట్ ఫోటో షూట్‌లతో కేక పెట్టిస్తోన్న కియారా అద్వానీ..
Instagram/kiaraaliaadvani
news18-telugu
Updated: October 17, 2019, 1:47 PM IST
Kiara Advani : కియారా అద్వానీ.. మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది ఈ భామ. ఆ సినిమా హిట్ తర్వాత.. తెలుగులో రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ నటించింది. ఆ సినిమాలో తన నటనతో పాటు అంద చందాలతో ప్రేక్షకుల్నీ భాగానే ఆకర్షించింది. అయితే ఆ సినిమాలో కంటెంట్ సరిగా లేక బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. దీంతో ఈ తెలుగులో భామకు అవకాశాలు తగ్గాయి. అయితేనేం.. హిందీలో కియారా దూసుకెళ్తుంది. విజయ దేవరకొండ బ్లాక్ బస్టర్ సినిమా 'అర్జున్ రెడ్డి'ని హిందీలో 'కబీర్ సింగ్‌' పేరుతో రీమేక్ చేయగా అందులో కియారా షాహిద్ కపూర్‌కు జోడిగా నటించి అదిరిపోయే హిట్‌ను అందుకుంది. ప్రస్తుతం.. కియారా లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో వచ్చిన కాంచనకు రీమేక్‌గా వస్తోంది. మరోవైపు కియారా.. కార్తిక్ ఆర్యన్‌తో భూల్ భూలయ్య 2 చేస్తోంది.
View this post on Instagram

⚓️

A post shared by KIARA (@kiaraaliaadvani) on


వరుసగా ఆఫర్స్ అందుకుంటూ మంచి ఊపు మీదున్న కియారా.. వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. దానికి సంబందించిన ఫోటోస్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది.

View this post on Instagram

Sunkissed💋

A post shared by KIARA (@kiaraaliaadvani) onFirst published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...