KIARA ADVANI LEHENGA WITH POCKET LOOKS GO VIRAL ON SOCIAL MEDIA SB
లెహంగాలో మెరిసిన స్టార్ హీరోయిన్.. మొబైల్ లెహంగాలో అలా పెట్టడంతో షాక్ తిన్న నెటిజన్స్
కియరా అద్వాని
ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ భామ.. తాజాగా లెహంగాలో కనిపించి అందర్నీ అలరించింది. లైట్ బ్లూ కలర్లో ఉన్న లెహంగా డిజైన్ చూసి అంతా షాక్ తిన్నారు. అయితే ఈ లెహంగాకు పాకెట్ కూడా ఉండటంతో ఫ్యాన్స్ నివ్వెరపోతున్నారు.
కియారా అద్వాని.. (Kiara Adwani) టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ భామ మంచి పేరు సంపాదించుకుంది. వరుస సినిమా ఆఫర్లతో బిజీగా మారింది. సోషల్ మీడియాలో కియార ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన కొత్త కొత్త లుక్ తో హల్ చల్ చేస్తుంటుంది. కియారాకు అన్ని రకాల డ్రెస్సులు చాలా బాగుంటుంది. వెస్ట్రన్, సంప్రదాయ దుస్తుల్లో అందరినీ ఆకర్షిస్తుంది. అందరి చూపు ఆమె వైపే ఉంటుంది. ప్రసిద్ధ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ చేశారు. తరచూ ఫ్యాష్ షోలలో షోస్టాపర్ గా కనిపిస్తుంది కియరా.
ప్రస్తుతం కియార అద్వాని, బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో(Varun Dhawan) కలిసి జుగ్ జుగ్ జియో మూవీలో నటిస్తోంది. అయితే ఈ సినిమా వచ్చేనెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే కియారా ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా మారింది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ మూవీలో అనిల్ కపూర్,నీతూకపూర్ కూడా నటిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో బిజీగా ఉన్న కియరా వేసుకున్న లెహంగా ఇప్పుడు హాట్ టాపిక్’గా మారింది. మూవీ ప్రమోషన్ల కోసం కియరా ఓ లెహంగా బ్లౌజ్ దుపట్టా వేసుకుంది. అయితే ఈ లెహంగాను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. లెహంగా చాలా అందంగా ఉంది. ఈ డ్రెస్సులో కియరా కూడా చాలా బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది. అయితే లెహంగాకు సైడ్ ఓ పాకెట్ కూడా ఉంది. ఆ విషయం నెటిజన్లు గుర్తించారు. ఆ పాకెట్లో సడన్‌గా కియరా తన మొబైల్ పెట్టడంతో ఈ విషయాన్ని నెటిజన్లు ఐడింటిఫై చేశారు. దీంతో లెహంగాలకు కూడా పాకెట్లు ఉంటాయా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం ఈ డ్రెస్సులో కియారా ఎంతో అందంగా ఉందని కామెంట్లె పెడుతున్నారు.
కియరా టాలీవుడ్లో కూడా సినిమాలు చేసింది. ప్రిన్స్ మహేష్‌బాబు సినిమా భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కియారా అద్వానీ పరిచయం అయ్మయింది.రామ్ చరణ్‌తో వినయ విధేయ రామలో స్క్రీన్ షేర్ చేసుకుంది కియారా. అది హిట్ కాకపోయినప్పటికి ఇమేజ్ మాత్రం తగ్గలేదు. బాలీవుడ్లో కబీర్ సింగ్ అనే ఒక్క మూవీతో బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. స్టార్ హీరోయిన్ స్టేటస్‌కి చేరుకుంది కియారా. తాజాగా పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్సీ15` చిత్రంలో నటిస్తుంది. ఇది పాన్ ఇండియా లెవల్లో రూపొందుతోంది. అలాగే విజయ్ దేవరకొండ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.