మన దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నా.. ఇప్పటికీ పలువురు సెలబ్రిటీలు కరోనా బారినపడుతున్నారు. మరికొందరు ఈ మహామ్మారి కారణంగా కన్నుమూస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎస్పీ బాలు వంటి వాళ్లు కరోనా కారణంగా కన్నుమూసారు. మరోవైపు సీనియర్ హీరో రాజశేఖర్ కరోనా బారిన పడి కోలుకున్నారు. రీసెంట్గా బీజేపీ ఎంపీ, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ సంగతి మరవక ముందే కియార అద్వానీ హిందీలో నటిస్తోన్న ‘జుగ్ జుగ్ జియో’ సినిమా షూటింగ్లో హీరో వరుణ్ ధావన్‌తో పాటు మరో అగ్ర నటుడు అనిల్ కపూర్‌తో పాటు నటి నీతూ సింగ్ కపూర్‌తో పాటు దర్శకుడు రాజ్ మెహతాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా టీమ్ మెంబర్స్‌లో కీలక సభ్యులకు కరోనా సోకడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసారు.
View this post on Instagram
ఇప్పటికే కియార అద్వానీ విషయానికొస్తే.. ఈమె తెలుగుతో పాటు హిందీలో పలు చిత్రాల్లో బిజీగా ఉంది. రీసెంట్గా అక్షయ్ కుమార్‌తో కలిసి ‘లక్ష్మి’ సినిమాలో నటించింది. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. మరోవైపు కియార తెలుగులో మంచి స్టోరీ దొరికితే యాక్ట్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anil Kapoor, Bollywood, Corona Possitive, Kiara advani, Varun Dhawan