కియారా అద్వానీ.. తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాలో వసుమతి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. గతేడాది షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’ సక్సెస్‌తో బాలీవుడ్లో జెండా పాతింది. ఆ తర్వాత ఇయర్ ఎండింగ్లో అక్షయ్ కుమార్‌తో చేసిన ‘గుడ్ న్యూస్’తో మరో హిట్‌ను తన అకౌంట్లో వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో వ రుస కమిట్మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది కియారా. ప్రస్తుతం కియారా అద్వానీ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్' అనే ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. ‘కాంచన’ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే 'ఇందూ కీ జవానీ' అనే మరో చిత్రం లోనూ ఆమె నటిస్తోంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగా టాప్ లెస్ ఫోటో షూట్ చేసి సంచలనం రేపింది. ఏంటి కియారాకు ఏమైంది. ఎవరైనా అవకాశాలు తగ్గిన తర్వాత ఇలాంటి ఫోటో షూట్స్ చేస్తారు. కానీ కియారా మాత్రం కెరీర్ మంచి స్పీడు మీదున్నపుడే ఈ ఫోటో షూట్ చేసి సంచలనం రేపింది. డబూ రత్నానీ చేసిన ఈ ఫోటో షూట్ ఈ యేడాది టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఒక టాప్ లెస్ ఫోటో కోసమే ఇంత చేసిన కియారా అద్వానీ.. ఇక సినిమా కోసము ఇంకెంత చేస్తుందో అని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఈ ఫోెటో షూట్లో కియారా కేవలం ఒక ఆకు మాత్రమే తన చేతులతో పట్టుకొని అడ్డు పెట్టుకున్న ఫోజుపై సోషల్ మీడియాలో ఈ భామపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసారు. ఇక ఈమె కనిపడినపుడల్లా మీడియా వాళ్లు టాప్ లెస్ ఫోజు గురించే అడుగుతున్నారు. దానికి కియారా కొత్తగా ఉంటుందని ట్రై చేశా. మీకూ నచ్చిందా .. అయితే నాకు నచ్చింది అంటూ సిగ్గుపడుతుంది. కొంత మంది కొంటే నెటిజన్స్ మాత్రం ఆకునైనా కాకపోతిమి మా జన్మ ధన్యమైపోయేది అంటూ రాగాలు ఆలపిస్తున్నారు. మొత్తానికి కియారా చేసిన ఈ ఫోటో షూట్ పై ఇప్పటికీ హాట్ హాట్ చర్చలు నడుస్తూనే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Kiara advani, Kollywood, Telugu Cinema, Tollywood