భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత వినయ విధేయ రామతో ఇక్కడే సెటిల్ అయిపోతుందేమో అనిపించింది కియారా అద్వానీ. కానీ ఊహించని విధంగా తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితం అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నార్త్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది కియారా. వరసగా స్టార్ హీరోలతో నటిస్తుంది. దాంతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ నటిస్తున్న 'ఇందూకి జవానీ' సినిమా నుంచి ఓ పాట విడుదలైంది.
అభీర్‌సేన్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో లేడు.. లేడీ ఓరియెంటెడ్‌గా కియారా ఈ సినిమాను చేస్తుంది. మికా సింగ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఓ పాట విడుదలైంది. ఇది చూసిన తర్వాత ఇడియట్ పాట గుర్తుకు రావడం ఖాయం. 'హసీనా పాగల్ దివాని..' అంటూ సాగే ఈ పెప్పీ సాంగ్ చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే పాటకు రీమిక్స్ వర్షన్.
మన పాటను అక్కడ తీసుకుని వాయించేసుకున్నారంతే. ఇప్పటికే మన పాటలు చాలా వరకు హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇడియట్ పాటను కూడా కాపీ కొట్టేసారు. అలా రవితేజ పాటకు కియారా అద్వానీ చిందేసింది. కథలే కాదు.. చివరికి పాటలు కూడా సౌత్ నుంచి నార్త్‌కు వెళ్తున్నాయన్నమాట. రింగ రింగ, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు లాంటి పాటలను కూడా ఇప్పటికే బాలీవుడ్లో కాపీ చేసారు. ఇప్పుడు ఇడియట్ పాట వంతు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kiara advani, Ravi Teja, Telugu Cinema, Tollywood