news18-telugu
Updated: September 8, 2019, 6:37 PM IST
Instagram/kiaraaliaadvani
Kiara Advani : కియారా అద్వానీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో గ్రాండ్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేష్‌తో నటించిన ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది కియారా. అంతేకాకుండా 'భరత్ అనే నేను' బ్లాక్ బస్టర్ అవ్వడంతో మరో సూపర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ'లో అవకాశం దక్కించుకుంది. అంతేకాదు.. ఆ సినిమాలో మంచి తన పరిధి మేరకు నటనతో ఆకట్టుకోవడమే కాకుండా అంద చందాలతో తెలుగువారిని భాగానే ఆకర్షించింది. కానీ భారీ అంచనాతో వచ్చిన ఆ సినిమాలో మేటర్ లేక.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో ఆ సినిమా తర్వాత మరే తెలుగులో సినిమాలో నటించలేదు. అది అలా ఉంటే... హిందీలో ఈ భామ ఇటీవల తెలుగు 'అర్జున్ రెడ్డి' రీమేక్..'కబీర్ సింగ్'లో షాహిద్ కపూర్ సరసన చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఫుల్ ఫామ్‌లో ఉన్న హాట్‌గా ఓ ఫోటో షూట్ చేసింది.
View this post on Instagram
🌼
A post shared by KIARA (@kiaraaliaadvani) on
ప్రస్తుతం నెటిజెన్స్ ఆ ఫోటో షూట్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. నటి కియారా అద్వానీ తాజాగా ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. పసుపు రంగులో ధగధగ మెరిసిపోయే డ్రెస్‌లో హాట్ లుక్‌తో ఉన్న ఫొటోపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.
అందులో కొందరూ ‘మ్యాగీ’ న్యూడిల్స్‌తో పోలుస్తూ కామెంట్లు పెడుతూ... ‘మీకు మ్యాగీ చాలా ఇష్టం అని తెలుస్తోంది. తిని.. తిని బోర్ కొట్టిందనుకుంటా.. అందుకే దానితో ఇలా గౌను చేయించుకుంది అంటూ కామెంట్ చేశాడు. అయితే కియారా అంతే సరదాగా రిప్లై ఇస్తూ.. హాహాహ్హా... రెడీ అయ్యేందుకు రెండు నిమిషాలే పట్టింది’ అంటూ కామెంట్ చేసింది. కియారా ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్' అనే ఓ హారర్ కామేడీలో అక్షయ్ కూమార్ జంటగా నటిస్తోంది. ఈ సినిమా తెలుగులో లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచనకు రీమేక్‌గా వస్తోంది. 'లక్ష్మీబాంబ్' 2020 జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Published by:
Suresh Rachamalla
First published:
September 8, 2019, 6:35 PM IST