కియారా అద్వానీ.. 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ ఒక్క సినిమాతో అమ్మడికి స్టార్ హీరోయిన్ గుర్తింపు అభించింది ఇక్కడ. అదే ఊపుతో వెంటనే రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ సినిమాలో మంచి నటనతో పాటు అందచందాలు తగిన మోతాదుల్లో ఆరబోసిన.. సినిమాలో కంటెంట్ సరిగా లేక బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. దీంతో ఆ సినిమా తర్వాత నుండి తెలుగులో మరో సినిమా చేయలేదు కియారా. అయితే హిందీలో మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ.. అదరగొడుతోంది. ఈ బ్యూటీ హిందీలో 'లస్ట్ స్టోరీస్' అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్‌లో కాస్తా ఘాటుగానే నటించి అందరి దృష్టిని ఆకర్షించింది కియారా. ఆ తర్వాత అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌లో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఈ సినిమాతో కియారాకు హిందీలో విపరీతంగా ఆఫర్స్ వచ్చాయి. అందులో భాగంగాతో ఓ సినిమా అక్షయ్ కుమార్‌తో మరో సినిమాను కార్తిక్ ఆర్యన్‌తో చేస్తోంది.
View this post on Instagram
Stay Classy, stay chic, stay cosmopolitan AT HOME ❤️ stay safe!#socialdistancing101 📸 @taras84
అది అలా ఉంటే.. కియారా హాట్ హాట్ గా తన అందాలని ఆరబోయడం కొత్తేమి కాదు. అందులో భాగంగా ఇటీవలే కాస్మోపాలిటన్ అనే మ్యాగజైన్ కోసం కియారా ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్లో ఏయిర్ ఫోర్స్ పైలట్లు ధరించే సింగిల్ పీస్ ప్యాంట్ షర్టు బ్లూకలర్ది వేసి పైన షర్ట్‌కి బటన్స్ పెట్టకుండా ఫుల్ హాట్ హాట్ ఫోజులిచ్చింది. డెనిమ్ డ్రెస్ కావడంతో మంచి ఫాష్లుక్ లో కనిపిస్తుంది కియారా. పైన బటన్లు పెట్టుకోకుండా ఫక్తు బాలీవుడ్ ఘాటు భామలాగా గ్లామరసం పంచింది. కియారా ప్రస్తుతం 'భూల్ భులయ్యా 2'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kiara advani