డైపర్లు మార్చిన కియారా అద్వానీ..

కియారా అద్వానీ

Kiara Advani : సినిమాల్లోకి రాకముందు తాను ఏం చేసేదాన్నో వివరించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది కియారా అద్వానీ..

  • Share this:
    Kiara Advani: కియారా అద్వానీ.. సూపర్ స్టార్ మ‌హేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో గ్రాండ్‌గా  తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేష్‌తో నటించిన ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌ హోదా దక్కించుకుంది కియారా. ఆ మువీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామలో అవకాశం దక్కించుకుంది. భారీ అంచనాతో వచ్చిన ఆ సినిమాలో మేటర్‌ లేక.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆ తర్వాత మరే తెలుగులో సినిమాలో నటించలేదు. అయితే.. హిందీలో ఈ భామ అర్జున్ రెడ్డి రీమేక్..కబీర్ సింగ్‌లో షాహిద్ కపూర్ సరసన నటించింది. MS Dhoni, కబీర్ సింగ్ సినిమాలతో బాలీవుడ్‌లో స్టార్‌డమ్ మంచి పేరు సంపాదించుకుంది. ఇక, లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో నటించి, బోల్డ్ పాత్రలకు న్యాయం చేయగలనని నిరూపించుకుంది. అయితే.. సినిమాల్లోకి రాకముందు తాను ఏం చేసేదాన్నో వివరించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

    ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ బ్యూటీ.. ఓ ప్రీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశానని, పిల్లలకు ఏ,బీ,సీ,డీలు నేర్పించేదాన్నని, నర్సరీ రైమ్స్ చెబుతూ ఉండేదాన్నని చెప్పింది. ఉదయం 7 గంటలకే స్కూల్‌కు వెళ్లేదాన్నని, అవసరమైతే పిల్లల డైపర్లు కూడా మార్చేదాన్ని అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది. చిన్న పిల్లలంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: