హోమ్ /వార్తలు /సినిమా /

మెట్రో రైలులో ఆ పనిచేసిన హీరోయిన్.. అలాంటివి బ్యాన్ అంటోన్న నెటిజన్లు

మెట్రో రైలులో ఆ పనిచేసిన హీరోయిన్.. అలాంటివి బ్యాన్ అంటోన్న నెటిజన్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మెట్రో రైలులో ఇలాంటి పనులు చేయకూడదని తెలియదా అంటూ హీరోయిన్ పై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సెలబ్రిటీలకు ఎలాంటి రూల్స్ వర్తించవు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మెట్రో రైలు ప్రయాణం చేస్తున్న వారు కొన్ని రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు.. స్మోకింగ్, డ్రింకింగ్ చేయడం లాంటివి చేయకూడదు. అంతేకాదు.. ఎటువంటి ఆహార పదార్థలు కూడా తినకూడదు. ఈ విషయాన్ని మెట్రో రైలులో కోచ్‌లపై కూడా రాసిపెట్టి ఉంటుంది. అయితే తాజాగా ఓ హీరోయిన్ మెట్రో రైలు ఎక్కి సందడి చేసింది. అంతేకాదు రైలులో కూర్చొని వడపావు కూడా తినింది.దీంతో ఆమె చేసిన పనిపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ, హీరో వరుణ్ ధావన్,అనిల్ కపూర్ మెట్రో రైలు ఎక్కారు. వీరిద్దరు కూడా మెట్రో రైలులో ప్రయాణిస్తూ వడపావు తిన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెట్రో రైలులో తినడంపై నిషేధం అని తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు దీనిపై స్పందిస్తూ.. మన దేశం కేవలం పేదవాళ్ల కోసమే రూల్స్ పెడుతుందంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మెట్రో రైలులో వీరికి విఐపీ ట్రీట్ మెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో అనిల్ కపూర్ ఎంతో హ్యాండ్ సమ్‌గా కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు కియార అద్వానీ, వరుణ్ ధావన్‌తో కలిసి జుగ్ జుగ్ జియో సినిమాలో నటిస్తోంది. ఇందులో అనిల్ కపూర్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో వీరిద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా వీళ్లే కనిపిస్తున్నారు. ప్రమోషన్ల కోసం ఫుల్ బిజీగా తిరుగుతున్నారు. కియారా ఇటీవలే నటించిన  భూల్ భులయ్యా టు సినిమా మంచి సక్సెస్ అయ్యింది. దీంతో ఈ మద్దుగుమ్మ వరుస పెట్టి సినిమాలకు సైన్ చేస్తుంది.


తెలుగులో కూడా కియారా నటిస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ బాబుతో కలిసి భరత్ అనే నేను సినిమాలో నటించింది. రామ్ చరణ్‌కు జంటగా వినయ విధేయ రామలో కూడా సందడి చేసింది. మరోసారి రామ్ చరణ్‌కు జోడీగా కియారా నటించనుంది. రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో రకరకాల రూమర్స్ వినపడ్డాయి. ఈ క్రమంలో తాజాగా చిత్రబృందం రామ్ చరణ్ సరసన నటించే భామను ప్రకటించారు. కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించనుందని ప్రకటించింది

First published:

Tags: Kiara advani, Metro Train, Varun Dhawan

ఉత్తమ కథలు