Khushbu Sundar-Rajinikanth | మీరు మా జాతి రత్నం.. మా తరగని నిధి అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను ఉద్దేశించి సీనియర్ హీరోయిన్ కుష్బూ సుందర్ ట్విట్ట్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే... గత కొన్ని రోజులుగా రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో పాటు కరోనా నేపథ్యంలో ఆయన వచ్చే యేడాది జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయకవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై రజినీకాంత్ స్పందించడంతో పాటు తాను వచ్చే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు త్వరలోనే రాజకీయ పార్టీతో పాటు జెండా, అజెండా అన్ని డిసెంబర్ 12న రజినీకాంత్ 70వ పుట్టినరరోజు సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని తలైవా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం వస్తోన్న వార్తలపై కుష్బూ సుందర్ స్పందించారు.
Dear @rajinikanth Sir. Nothing is more important than your good health and happiness. You are our precious gem. You are our treasure. Pls do what you is best for you, health wise and otherwise. Nothing will change our love for you. We will continue to idolize you all our lives ❤
— KhushbuSundar ❤️ (@khushsundar) October 30, 2020
మీ ఆరోగ్యం కన్న సంతోషం ఇచ్చే విషయం ఏది ఏది ముఖ్యం కాదు. మీరు మా జాతి రత్నం.. మా తరగని నిధి మీరే అంటూ ట్వీట్ చేసారు. అంతేకాదు ఆరోగ్యం ఇతరత్రా.. . మీకు చెప్పాల్సిన దాన్ని కాదు.. మీకు ఏది మంచిదని తోస్తే..అదే చేయండి అంటూ విన్నవించింది. మీరు ఎపుడు ఎక్కడా ఏ పార్టీ పెట్టినా.. మీపై మాకున్న గౌరవంలో ఎలాంటి మార్పులు ఉండదన్నారు. అంతేకాదు మీ మార్గదర్శనంలో మా జీవితమంతా మిమ్నల్ని ఆరాధించడం కొనసాగిస్తామన్నారు. ఇక కుష్బూ సుందర్ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకంది. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ సందర్బంగా ఆమె పై వివిధ పోలీస్ స్టేషన్స్‌లో కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు ప్రస్తుతం కుష్బూ సుందర్.. రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అన్నాత్తే’ సినిమాలో కలిసి నటిస్తోంది. చాలా యేళ్ల తర్వాత రజినీకాంత్ సరసన కుష్బూ సుందర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా పై తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Rajinikanth, Tamil nadu, Tollywood