మాస్ రాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించిన చిత్రం ఖిలాడి. ఈ సినిమాకు తొలిరోజు వసూళ్లు ఊహించినంతగా రాలేదు. రెండో రోజు కూడా పరిస్థితుల్లో మార్పు లేదు. మూడో రోజు.. అందులోనూ ఆదివారం అయినా కోలుకుంటుందేమో అనుకుంటే.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. పైగా డిజే టిల్లు వాయింపు ముందు ఖిలాడి ఆటలు సాగడం లేదు. సెకండ్ డే కూడా చాలా చోట్ల దారుణంగా కలెక్షన్స్ డ్రాప్ అయిన వసూళ్లు.. మూడో రోజు కూడా అదే కంటిన్యూ అయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కనీసం 2 కోట్ల షేర్ వసూలు చేయలేకపోయింది ఈ చిత్రం. గతేడాది ఈయన నటించిన క్రాక్ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మూడు రోజుల్లోనే 15 కోట్లకు పైగా వసూలు చేసింది ఆ సినిమా. కానీ ఇప్పుడు ఖిలాడి మాత్రం అంచనాలు అందుకోలేదు. చాలాచోట్ల ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ అదిరిపోయే కలెక్షన్స్ మాత్రం రాలేదు. డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రంలో. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఖిలాడి సినిమాలో స్క్రీన్ ప్లే స్లోగా ఉండటంతో సినిమాకు మైనస్ అయిపోయింది. ఈ సినిమాకు 3 డేస్‌లో వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..
నైజాం: 3.05 కోట్లు
సీడెడ్: 1.17 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.99 కోట్లు
ఈస్ట్: 0.53 కోట్లు
వెస్ట్: 0.44 కోట్లు
గుంటూరు: 0.82 కోట్లు
కృష్ణా: 0.39 కోట్లు
నెల్లూరు: 0.37 కోట్లు
ఏపీ, తెలంగాణ 3 డేస్ కలెక్షన్స్: 7.76 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 0.62 కోట్లు
ఓవర్సీస్: 0.35 కోట్లు
హిందీ కలెక్షన్స్: 0.25 కోట్లు
వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్స్: 8.89 కోట్లు
ఖిలాడి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.23 కోట్ల బిజినెస్ జరిగింది. రవితేజ కెరీర్‌లో ఈ మధ్య కాలంలో జరిగిన బిగ్గెస్ట్ బిజినెస్ ఇది. క్రాక్ బ్లాక్‌బస్టర్ కావడంతో ఖిలాడి సినిమాకు బిజినెస్ బాగానే జరిగింది. కానీ ఆ క్రేజ్ వాడుకోవడంలో రవితేజ విఫలమయ్యాడు. ఈయన ఖిలాడి సినిమాకు ఓపెనింగ్స్ ఊహించినంత రాకపోవడంతో బయ్యర్లలో భయం మొదలైంది. ఈ సినిమా ఇంకా 14.05 కోట్లు వసూలు చేస్తే కానీ సేఫ్ అవ్వదు. మొదటి 3 రోజుల్లో కేవలం 8.89 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. వీక్ డేస్ మొదలైతే ఖిలాడి అసలు ఫలితం బయటికి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Box Office Collections, Khiladi Movie, Ravi Teja, Telugu Cinema, Tollywood