హోమ్ /వార్తలు /సినిమా /

Khiladi 1st week WW collections: ‘ఖిలాడి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఫ్లాప్ దిశగా రవితేజ సినిమా..

Khiladi 1st week WW collections: ‘ఖిలాడి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఫ్లాప్ దిశగా రవితేజ సినిమా..

రవితేజ ‘ఖిలాడి’ కలెక్షన్స్

రవితేజ ‘ఖిలాడి’ కలెక్షన్స్

Khiladi 1st week WW collections: రోజులు మారుతున్నా మాస్ రాజా రవితేజ (Ravi Teja) హీరోగా రమేష్ వర్మ (Ramesh Varma) తెరకెక్కించిన చిత్రం ఖిలాడి (Khiladi) జాతకం మాత్రం మారడం లేదు. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్ వసూళ్లపై దారుణంగా ప్రభావం చూపిస్తుంది.

ఇంకా చదవండి ...

రోజులు మారుతున్నా మాస్ రాజా రవితేజ (Ravi Teja) హీరోగా రమేష్ వర్మ (Ramesh Varma) తెరకెక్కించిన చిత్రం ఖిలాడి (Khiladi) జాతకం మాత్రం మారడం లేదు. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్ వసూళ్లపై దారుణంగా ప్రభావం చూపిస్తుంది. యావరేజ్ కలెక్షన్లతో అలా వెళ్తుందే కానీ సేఫ్ అయ్యేలా మాత్రం కనిపించడం లేదు. మొదటి రోజు 4.80 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత రోజు నుంచి మరింత డ్రాప్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా నైజాంలో మరింత దారుణంగా కలెక్షన్స్ పడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కేవలం 10 కోట్లు మాత్రమే షేర్ వచ్చింది ఈ సినిమాకు. 7వ రోజు కూడా ఇదే జరిగింది. 42 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పటికే చాలా చోట్ల ఖిలాడి వసూళ్లు దారుణంగా డ్రాప్ అయ్యాయి. క్రాక్ (Krack) లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చినా.. ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవడంలో ఖిలాడి ఫెయిల్ అయింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే తేడా కొట్టడంతో సినిమా కూడా తేడా కొట్టేసిందంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాతో వరసగా రెండో హిట్ కొట్టాలని కలలు కన్న రవితేజకు అవి కలలుగానే మిగిలిపోయేలా కనిపిస్తున్నాయి.

డింపుల్ హయాతీ (Dimple Hayathi), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రంలో. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఖిలాడి సినిమాలో స్క్రీన్ ప్లే స్లోగా ఉండటంతో సినిమాకు మైనస్ అయిపోయింది. ఈ సినిమాకు ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..

నైజాం: 3.79 కోట్లు

సీడెడ్: 1.67 కోట్లు

ఉత్తరాంధ్ర: 1.42 కోట్లు

ఈస్ట్: 0.74 కోట్లు

వెస్ట్: 0.61 కోట్లు

గుంటూరు: 1.03 కోట్లు

కృష్ణా: 0.54 కోట్లు

నెల్లూరు: 0.50 కోట్లు

ఏపీ, తెలంగాణ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 10.33 కోట్లు

రెస్టాఫ్ ఇండియా  + కర్ణాటక: 0.81 కోట్లు

ఓవర్సీస్: 0.47 కోట్లు

హిందీ కలెక్షన్స్: 0.63 కోట్లు 

వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 12.24 కోట్లు

ఖిలాడి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.23 కోట్ల బిజినెస్ జరిగింది. రవితేజ కెరీర్‌లో ఈ మధ్య కాలంలో జరిగిన బిగ్గెస్ట్ బిజినెస్ ఇది. క్రాక్ బ్లాక్‌బస్టర్ కావడంతో ఖిలాడి సినిమాకు బిజినెస్ బాగానే జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఖిలాడి జరిగిన బిజినెస్‌కు చాలా దూరంలోనే ఆగిపోయేలా కనిపిస్తుందంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు ఈ చిత్రం కలెక్షన్స్ 12.24 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 11 కోట్లకు పైగా వస్తే కానీ సినిమా సేఫ్ అనిపించదు. ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రాకపోవడంతో బయ్యర్లలో భయం మొదలైపోయింది. ఇది రవితేజ తర్వాతి సినిమాలపై కూడా ప్రభావం చూపించకపోదు.

First published:

Tags: Box Office Collections, Khiladi Movie, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు