అవును.. నిజంగానే ఇదే జరుగుతుంది ఇప్పుడు. ప్రభుదేవాను కానీ దొరికితే మాత్రం ఇక అంతే సంగతులు. వేటాడి వెంటాడి మరీ చంపుతున్నాడు ఈయన. అయితే అది నిజంగా మాత్రం కాదులెండీ.. ప్రస్తుతం ప్రభుదేవా ఖామోషీ సినిమాలో నటిస్తున్నాడు. చక్రి తోలేటి దర్శకుడు. తమిళ్‌తో పాటు ఒకేసారి హిందీలో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు చక్రి. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. కరుడు కట్టిన హంతకుడిగా ప్రభుదేవా నటిస్తున్నాడు.
కెరీర్లో తొలిసారి పూర్తిస్థాయి విలన్ పాత్రలో నటిస్తున్నాడు ఈయన. ఇది పూర్తిగా సైకో పాత్ర. టీజర్ మొదట్లోనే అతడితో జాగ్రత్త.. దొరికితే అంతే సంగతులు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు దర్శకుడు చక్రి తోలేటి. ఇక తమన్నాతో పాటు మరికొందరు కూడా ప్రభుదేవా బారిన పడ్డ వాళ్ళుగా నటిస్తున్నారు. మే 31న ఈ సినిమా విడుదల కానుంది. షూటింగ్ రెండేళ్ల కిందే మొదలైనా కూడా అనుకోని కారణాలతో ఇన్నాళ్లూ ఆలస్యమైంది ఈ చిత్రం. మొత్తానికి ఈ చిత్రంతో అయినా బాలీవుడ్లో విజయం అందుకోవాలని చూస్తుంది తమన్నా. మరి ఏం జరుగుతుందో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhu deva, Tamannah, Tamil Cinema, Telugu Cinema