హీరోయిన్ సంగీతపై ఆమె తల్లి ఫిర్యాదు... ఆమె తనతో ఆ పనులు చేయించిందన్న ‘ఖడ్గం’ బ్యూటీ..

ఇంటి నుంచి వెళ్లిపోవాలని సంగీత బెదిరిస్తోందని మహిళా కమీషన్‌లో ఫిర్యాదు చేసిన ఆమె తల్లి భానుమతి... తప్పుడు ఆరోపణలు చేసినందుకు ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పిన సీనియర్ హీరోయిన్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 13, 2019, 6:45 PM IST
హీరోయిన్ సంగీతపై ఆమె తల్లి ఫిర్యాదు... ఆమె తనతో ఆ పనులు చేయించిందన్న ‘ఖడ్గం’ బ్యూటీ..
ఇంటి నుంచి వెళ్లిపోవాలని సంగీత బెదిరిస్తోందని మహిళా కమీషన్‌లో ఫిర్యాదు చేసిన ఆమె తల్లి భానుమతి... తప్పుడు ఆరోపణలు చేసినందుకు ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పిన సీనియర్ హీరోయిన్...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 13, 2019, 6:45 PM IST
హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఖడ్గం’ మూవీలో ‘ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ అమాయకంగా ఫేస్ పెట్టి అడిగే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అదరగొట్టిన సంగీత... ఆ తర్వాత ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, ‘విజయేంద్రవర్మ’, ‘సంక్రాంతి’ వంటి ఎన్నో సినిమాల్లో నటించింది. బాల దర్శకత్వంలో రూపొందిన ‘శివపుత్రుడు’ సినిమాలో సంగీత పాత్రకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాల్లో ఉన్న సంగీత... తాజాగా వివాదాల్లో ఇరుక్కుంది. ఈ వివాదానికి సంగీత తల్లి భానుమతి బాలన్ ఆమెపై చేసిన ఆరోపణలే. సంగీత, ఆమె తల్లి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. సంగీత తన భర్తతో కలిసి పై అంతస్థులో ఉంటుంటే... కింది అంతస్థులో తల్లి, ఆమె పెద్ద కుమారుడి కుటుంబం ఉంటోంది. కొన్నాళ్ల క్రితం సంగీత తమ్ముడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటినుంచి తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని సంగీత, ఆమె భర్త క్రిష్ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేసింది భానుమతి బాలన్. వృద్ధాప్యంలో ఉన్న భానుమతి ఇలా బయటికి వచ్చి, సంగీత గురించి ఈ విధంగా ఫిర్యాదు చేయడంతో సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేగింది. సంగీతకు ఓ అన్నా, ఓ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ప్రమాదంలో చనిపోగా, అన్న తన ఇంటికి లాగేసుకుంటారనే భయం, సంగీతకు పుట్టుకుందని... అందుకే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తోందని తన ఫిర్యాదులో ఆరోపించింది భానుమతి.
sangeetha Krish, Actress Sangeetha, Sangeetha heroine photos, Heroine Sangeetha hot photos, Sangeetha Hot scenes, Sangeetha mother issue, Sangeetha Krish mother issue, Sangeetha comments on her mother, sangeetha khadgam movie, Sangeetha hot scenes, సంగీత, హీరోయిన్ సంగీత, ఖడ్గం హీరోయిన్ సంగీత, సంగీత వివాదం, సంగీత ఆస్తి గొడవ, సంగీత క్రిష్, సంగీత అదిరిందయ్యా చంద్రం మూవీ హాట్ సీన్స్, సంగీత సంక్రాంతి మూవీ, సంగీత శివపుత్రుడు, సంగీత నటి, సంగీత తల్లి వివాదం, సంగీత క్రిష్ కామెంట్స్
భర్త క్రిష్‌, కూతురితో నటి సంగీత (Photo: twitter)


దీంతో విచారణకు రావాల్సిందిగా సంగీతకు నోటీసులు జారీ చేసింది మహిళా కమీషన్. మూడు రోజుల కిందట మహిళా కమీషన్ ఎదుట సంగీత, ఆమె భర్త క్రిష్ హాజరై, తమ వాదన వినిపించారు. ప్రస్తుతం సంగీత, ఆమె తల్లి ఉంటున్న ఇళ్లు సంగీత పేరు మీదే ఉంది. కోలీవుడ్ సింగర్ క్రిష్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగీతకు ఓ కూతురు కూడా ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సంగీత...రీఎంట్రీ తర్వాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడని సంగీత... ట్విట్టర్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి, తల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.


‘13 ఏళ్ల వయసు నుంచే నన్ను ఓ సంపాదించే వస్తువుగా చూశావు... థ్యాంక్యూ... బ్లాంక్స్ చెక్స్ మీద సంతకాలు చేయించుకున్నావు థ్యాంక్యూ...తాగుడుకు, డ్రగ్స్‌కు బానిసై, జీవితంలో ఏ పనీ చేయని నీ కొడుకుల కోసం ఇప్పుడు నన్ను వీధిన పడేశావు... థ్యాంక్యూ... నాకు సంబంధించిన అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుని, నన్ను ఓ మూలన పడుకోబెట్టావు... థ్యాంక్యూ... పెళ్లి కూడా చేయకుండా అలాగే ఉంచాలని చూశావు. నేను ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేస్తుంటే చూడలేక... మా సంసారంలో అలజడి తెస్తున్నావు... ఓ తల్లి ఎలా ఉండకూడదో నేర్పించావు... థ్యాంక్యూ... ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ తప్పుడు ఆరోపణల వల్ల నేను మరింత రాటుదేలిపోతానేమో... నన్ను మరింత పరిణతి చెందేలా, బోల్డ్ అండ్ స్ట్రాంగ్ మహిళలా అయ్యేలా చేస్తున్న నీకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేసింది సంగీత. సంగీత, తన తల్లికి మధ్య జరుగుతున్న గొడవ... కొందరు హీరోయిన్ల జీవితాల్లో వారి కుటుంబం పాత్ర ఎలా ఉంటోందో మరోసారి రుజువు చేసింది.

First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...