KGF2 | కేజీఎఫ్2 గుడ్ న్యూస్.. రాజమౌళి వల్లే అదంతా..?

కేజీఎఫ్2 పోస్టర్, రాజమౌళి

KGF2, RRR Movie: జూలై 30న కేజీఎఫ్2 సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

  • Share this:
    KGF2, RRR Movie: మెగా హీరో రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర విడుదల తేదీ మార్చుతూ చిత్ర బృందం ప్రకటన చేసింది. దీనిపై బుధవారం నాడు అధికారిక ప్రకటన కూడా చేసింది. దీంతో ఆ రోజు సినిమాలు విడుదల చేద్దామనుకున్న పలు సినిమాలకు కాస్త రిలీఫ్ అయ్యింది. రాజమౌళి సినిమాలు అంటేనే రికార్డులు తిరగరాసేలా ఉంటాయి. ఆ ప్రభంజనం ముందు తట్టుకోలేక మిగితా సినిమాలు కుదేలైపోతుంటాయి. రాజమౌళి సినిమాల్లో ఒక్కటి కూడా ఫ్లాప్ లేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో.. మరి ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా వస్తుందంటే మిగితా సినిమాల దర్శకులు, హీరోలు, నిర్మాతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉంటారు. అయితే, జూలై 30న ఆ సినిమాను విడుదల చేద్దామనుకున్న కొన్ని కారణల వల్ల సినిమాను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి వాయిదా వేశారు.

    కాగా, జూలై 30న కేజీఎఫ్2 సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. యశ్ హీరోగా వచ్చిన కేజీఎఫ్1 సినిమా అంచనాలకు మించి బ్లాక్‌బస్లర్ కావడంతో కేజీఎఫ్2ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ముందుగా ఆ సినిమాను ఆగస్టులో లేదా సెప్టెంబరులో విడుదల చేయాలని భావించారు. అయితే, రేసు నుంచి RRR సినిమా తప్పుకోవడంతో కేజీఎఫ్2 విడుదలను ముందుకు జరపాలని చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందట. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. యశ్ పుట్టిన రోజు సందర్భంగా యశ్ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, రాజమౌళి తీసుకున్న నిర్ణయం వల్లే కేజీఎఫ్2 విడుదల ముందుకు జరిగే అవకాశం ఉందని, కేజీఎఫ్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి.
    కేజీఎఫ్2 పోస్టర్
    Published by:Shravan Kumar Bommakanti
    First published: