రెండోసారి తండ్రి అయిన కేజీఎఫ్ స్టార్.. జూనియర్ యశ్‌కి జన్మనిచ్చిన రాధిక..

Yash Radhika blessed with baby boy : బెంగళూరులోని ఫార్టిస్ ఆస్పత్రిలో రాధికా బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆ ఫోటోలు మాత్రం ఎక్కడా షేర్ చేయలేదు.

news18-telugu
Updated: October 30, 2019, 3:40 PM IST
రెండోసారి తండ్రి అయిన కేజీఎఫ్ స్టార్.. జూనియర్ యశ్‌కి జన్మనిచ్చిన రాధిక..
కుమార్తె ఆర్యతో యశ్ రాధిక దంపతులు
  • Share this:
కన్నడ స్టార్ హీరో యశ్-రాధికా పండిట్ దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. బెంగళూరులోని ఫార్టిస్ ఆస్పత్రిలో రాధికా బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆ ఫోటోలు మాత్రం ఎక్కడా షేర్ చేయలేదు.కొద్ది నెలల వరకు ఆ ఫోటోలు బయటకు లీక్ చేయవద్దని యష్ దంపతులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం జూనియర్ యష్ ఫోటోల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కాగా,కొద్దిరోజుల క్రితమే రాధికకు శ్రీమంతం నిర్వహించారు. ఆ ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా రాధిక-యష్ దంపతులు తమ కూతురు ఆర్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. అందులో ఆర్య చాలా క్యూట్‌గా కనిపించింది. గతేడాది డిసెంబర్‌లో ఈ జంట ఆర్యకు జన్మనిచ్చారు.కాగా,పలు చిత్రాల్లో కలిసి నటించిన యశ్-రాధికా 2016లో వివాహం చేసుకున్నారు. ఇక గతేడాది విడుదలైన కేజీఎఫ్ సినిమాతో యశ్ క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేజీఎఫ్-2లో యశ్ నటిస్తున్నారు.
First published: October 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>