KGF star Yash: కెజియఫ్ హీరో యశ్ కొడుకు పేరు తెలుసా..

KGF Star Yash son: ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు యశ్. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న ఈయన.. కెజియఫ్ సినిమా తర్వాత..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 14, 2020, 5:33 PM IST
KGF star Yash: కెజియఫ్ హీరో యశ్ కొడుకు పేరు తెలుసా..
యశ్ తనయుడు (Yash son)
  • Share this:
ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు యశ్. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న ఈయన.. కెజియఫ్ సినిమా తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దాంతో యశ్ గురించి.. అతడి కుటుంబం గురించి కూడా తెలుసుకోవాలని ఆడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎలాగూ షూటింగ్ కూడా లేకపోవడంతో యశ్ మాత్రం పూర్తిగా తన టైమ్ కుటుంబానికి కేటాయిస్తున్నాడు.








View this post on Instagram





And i surrender...❤ P.S " Perks of home quarantine " my t'shirt doesn't agree though 😜 Stay safe everyone 🤗


A post shared by Yash (@thenameisyash) on





భార్యా పిల్లలతోనే సమయం అంతా గడిపేస్తున్నాడు. ఈయన భార్య రాధిక పండిట్ కూడా హీరోయినే. కన్నడ నాట ఈమెకు మంచి గుర్తింపు ఉంది. కొన్నేళ్ల కింద యశ్‌ను పెళ్లి చేసుకున్న రాధిక ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది కూడా. మొదట అమ్మాయి.. గతేడాది అబ్బాయి పుట్టారు ఈ జంటకు. తాజాగా కొడుకు జూనియర్ యశ్‌తో ఆడుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు.



తాజాగా కొడుకుతో ఆడుకుంటూ.. బుడ్డోడి డాన్సులు చూస్తూ మురిసిపోతున్నాడు యశ్. తన కొడుకుకు ఇంకా పేరు పెట్టలేదని.. కానీ ఇంట్లో మాత్రం అంతా తనను బ్రష్ అని పిలుస్తామని చెప్పాడు యశ్. షూటింగ్స్ లేకపోవడంతో పిల్లలతోనే టైమ్ గడిచిపోతుందని చెప్తున్నాడు యశ్. కెజియఫ్ 2 షూటింగ్ ఇప్పటికే చివరికి వచ్చేసింది. ఇదే ఏడాది విడుదల చేయాలనుకున్నా కూడా కుదిరేలా కనిపించడం లేదు.
Published by: Praveen Kumar Vadla
First published: July 14, 2020, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading