ఒకే ఒక్క సినిమాతో ఒక్క భాష నుంచి అన్ని భాషల్లో స్టార్ అయిపోయాడు యశ్. ఈయన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రెండేళ్ల కింద యశ్ నటించిన కెజియఫ్ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి తర్వాత ఇండియన్ వైడ్గా విజయం సాధించిన సినిమా ఇదే. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియన్ ఇమేజ్ సంపాదించుకున్నాడు యశ్. ఇప్పుడు ఈయన నటిస్తున్న కెజియఫ్ 2 సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు యశ్ తన వారసుడిని పరిచయం చేసాడు. 2019 అక్టోబర్ 30న యశ్ దంపతులకు కొడుకు పుట్టాడు.
ఇప్పటి వరకు ఈ బుడ్డోడిని ప్రపంచానికి పరిచయం చేయలేదు. అమ్మాయిని చూపించాడు కానీ కొడుకును మాత్రం చూపించలేదు యశ్. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. తన వారసుడిని సోషల్ మీడియాలో పరిచయం చేసాడు యశ్. తన గారాల కొడుకు ఫొటోను కెజియఫ్ స్టార్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు.
యశ్ దంపతులు బాబుతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిన్నోడికి హాయ్ చెప్పండి.. మీ ఆశీర్వచనాలు అందించండి అంటూ పోస్ట్ చేసాడు యశ్. ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:May 01, 2020, 21:14 IST