హోమ్ /వార్తలు /సినిమా /

Yash: కేజీఎఫ్ స్టార్ యశ్ ఖాతాలో మరో రికార్డు.. ఆ విషయంలో ఒకే ఒక్కడుగా రాకింగ్ స్టార్..

Yash: కేజీఎఫ్ స్టార్ యశ్ ఖాతాలో మరో రికార్డు.. ఆ విషయంలో ఒకే ఒక్కడుగా రాకింగ్ స్టార్..

Yash: యశ్ కన్నడతోప పాటు దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన పేరు.  ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు కేజీఎఫ్ స్టార్ యశ్. తాజాగా యశ్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.

Yash: యశ్ కన్నడతోప పాటు దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన పేరు.  ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు కేజీఎఫ్ స్టార్ యశ్. తాజాగా యశ్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.

Yash: యశ్ కన్నడతోప పాటు దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన పేరు.  ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు కేజీఎఫ్ స్టార్ యశ్. తాజాగా యశ్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.

  Yash: యశ్ కన్నడతోప పాటు దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన పేరు.  ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు కేజీఎఫ్ స్టార్ యశ్. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న ఈయన.. కేజియఫ్ సినిమా తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సినిమా కన్నడలో తొలి రూ. 230 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డు క్రియేట్  చేసింది. అంతేకాదు హిందీలో దాదాపు రూ. 50 కోట్లకు పైగా కొల్లగొట్టింది. తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే రూ. 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తమిళనాట కూడా 10 కోట్ల వరకు వసూలు చేసింది. . మొత్తంగా కేజీఎఫ్ మూవీతో యశ్ యశస్సు పీక్స్‌కు వెళ్లిందనే చెప్పాలి. ప్రభాస్ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేజీఎఫ్ సినిమా విషయానికస్తే..  70,80ల్లో కర్ణాటకలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు.

  తాజాగా యశ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఇతన్ని ఇన్‌‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న వారు 5 మిలియన్స్ దాటారు. కన్నడ నాట ఏ హీరోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత మంది ఫాలోవర్స్ లేరు. ఈ రికార్డు సాధించిన తొలి కన్నడ హీరోగా యశ్ రికార్డు నెలకొల్పాడు.

  View this post on Instagram


  A post shared by Yash (@thenameisyash)  KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కించాడు  దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు నటిస్తున్నారు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 1లో మెయిన్ విలన్ బ్రదర్ పాత్రలో అధీరా అనే పాత్రను చూపించారు. కానీ ఆ క్యారెక్టర్ చేసింది ఎవరో రివీల్ చేయలేదు. ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్‌తో అథీరా పాత్ర కోసం తీసుకున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే  విడుదలైన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

  kgf chapter 2 teaser,kgf chapter 2 teaser records,kgf chapter 2 teaser views,kgf chapter 2 teaser reaction,kgf chapter 2 trailer,kgf 2 teaser,kgf chapter 2 teaser 100 million views,kgf chapter 2 teaser review,kgf chapter 2 official teaser,kgf chapter 2 teaser views count,kgf chapter 2 teaser views counting,yash kgf chapter 2,kgf chapter 2 updates,కెజియఫ్ 2,కెజియఫ్ ఛాప్టర్ 2 టీజర్ రికార్డులు,కెజియఫ్ 2 టీజర్ 100 మిలియన్ వ్యూస్
  కెజియఫ్ 2 టీజర్‌కు 100 మిలియన్స్ (KGF Chapter 2)

  ఆ సంగతి పక్కన పెడితే.. కేజీఎఫ్ చాప్టర్ 1 కోసం పారితోషకంగా రూ. 11 కోట్ల వరకు తీసుకున్నాడు. ఒక రకంగా కన్నడ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. ఒక సినిమా కోసం రెండేళ్లకు పైగా బల్క్ డేట్స్ కేటాయించడంతో అంత పారితోషం తీసుకున్నాడు. తాజాగా కేజీఎప్ 2 ఛాప్టర్ 2 కోసం రాకింగ్ స్టార్ తన రెమ్యునరేషన్‌ను దాదాపు రూ. 30 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు శాండిల్ వుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 200 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక అన్ని భాషల్లో డిజిటల్, శాటిలైట్ రైట్స్ అదనం. ఈ సినిమాను దేశ వ్యాప్తంగా జూలై 16న విడుదల చేస్తున్నారు.

  First published:

  Tags: Kannada Cinema, KGF, Sandalwood, Tollywood, Yash

  ఉత్తమ కథలు