కన్నడ హీరో యశ్‌పై రాజమౌళి ప్రశంసలు..‘కేజీఎఫ్’ సక్సెస్ కావాలని కోరిన జక్కన్న

‘బాహుబలి’ సక్సెస్ తర్వాత దక్షిణాది సినిమాల సత్తా ఏందో దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసొచ్చింది. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.O’ మూవీ ఉత్తరాదిన మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.ఈ మూవీస్ తర్వాత అందరి చూపు ఇపుడు కన్నడలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ మూవీపైనే ఉంది.

news18-telugu
Updated: December 10, 2018, 6:36 PM IST
కన్నడ హీరో యశ్‌పై రాజమౌళి ప్రశంసలు..‘కేజీఎఫ్’ సక్సెస్ కావాలని కోరిన జక్కన్న
కేజీఎఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి
  • Share this:
‘బాహుబలి’ సక్సెస్ తర్వాత దక్షిణాది సినిమాల సత్తా ఏందో దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసొచ్చింది. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.O’ మూవీ ఉత్తరాదిన మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీ హిందీ వెర్షన్ ఇప్పటి వరకు రూ.167 కోట్లను కొల్లగొట్టింది.

ఈ మూవీస్ తర్వాత అందరి చూపు ఇపుడు కన్నడలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ మూవీపైనే ఉంది. ఈ మూవీని ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంతో పాటు చైనీస్, జపనీస్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఇన్నిభాషల్లో విడుదల కాబోతున్న ఫస్ట్ కన్నడ మూవీ ఇదే.ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘కేజీఎఫ్’ మూవీలో యశ్ లుక్ రఫ్‌గా మాసివ్‌గా ఉంది. కర్నాటకలో కోలార్ గోల్డ్ ఫీల్డ్‌కు ఒక సామాన్యుడు ఎలా కింగ్ అయ్యాడనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను జక్కన్న సన్నిహితుడు సాయి కొర్రపాటి మంచి రేటుకే కొనుక్కొన్నాడు. రీసెంట్‌గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొని యశ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.కేజీఎఫ్ మూవీలో యశ్


అంతేకాదు ఒక సామాన్య బస్సు డ్రైవర్ కొడుకు...అంచలంచెలుగా ఎదిగి కన్నడ సూపర్ స్టార్‌గా ఎదిగిన వైనాన్ని ఈ వేడుకగా రాజమౌళి చెప్పుకొచ్చాడు. కొడుకు స్టార్ అయిన ఇప్పటికీ యశ్ వాళ్ల నాన్న..ఒక సాధారణ బస్సుడ్రైవర్‌గా పనిచేస్తునే ఉన్నాడంటూ సభా వేదికపై వెల్లడించాడు. ఒక రకంగా యశ్ కంటే వాళ్ల నాన్నే సూపర్ స్టార్ అని రాజమౌళి కితాబిచ్చాడు. ఈ మూవీని ఈ నెల 21న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
ఇది కూడా చదవండి 

‘పేట్టా’ మూవీ నుంచి త్రిష, రజినీకాంత్ లుక్ రిలీజ్: రీఫ్రెష్‌గా ఫీలవుతున్న తలైవా ఫ్యాన్స్

నాగబాబు క‌మెంట్స్‌పై మండి ప‌డుతున్న బాల‌కృష్ణ ఫ్యాన్స్..

వివాదంలో ర‌ష్మి గౌత‌మ్.. దేనికైనా రెడీ అంటున్న హాట్ యాంక‌ర్..
First published: December 10, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు