KGF సినిమాను అక్రమంగా ప్రసారం చేసిన ఛానెల్‌పై కేసు..

KGF: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా కెజియఫ్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఊహకందని విజయం సాధించింది. తెలుగులో కన్నడ సినిమాలకు కనీసం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 9, 2020, 10:07 PM IST
KGF సినిమాను అక్రమంగా ప్రసారం చేసిన ఛానెల్‌పై కేసు..
కెజియఫ్ ఛాప్టర్ 1 (KGF)
  • Share this:
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా కెజియఫ్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఊహకందని విజయం సాధించింది. తెలుగులో కన్నడ సినిమాలకు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావు అనే అపనమ్మకం ఉన్న సమయంలో కెజియఫ్ ఏకంగా 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక ఈ చిత్రం రెండోభాగం కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇందులో తెలుగు నటుడు రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక రవీనా టాండన్, సంజయ్ దత్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ కూడా ఉంది.

కెజియఫ్ 2 (KGF Chapter 2 release date)
కెజియఫ్ 2 (KGF Chapter 2 release date)


కెజియఫ్ 2 అక్టోబర్ 23న వస్తుందని చెప్పారు కానీ లాక్‌డౌన్ కారణంగా అనుకున్న సమయానికి రావడం కష్టంగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్రమంగా ఓ లోకల్ ఛానెల్ ప్రసారం చేయడం వివాదంగా మారింది. దీనిపై లీగల్ చర్యలు తీసుకోడానికి రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. ఇదే విషయంపై కెజియఫ్ నిర్మాత కార్తీక్ గౌడ ట్విట్టర్‌లో స్పందించాడు. చట్ట విరుద్ధంగా నిబంధనలు ఉల్లంఘించి తమ సినిమాను లోకల్ ఛానెల్ ప్రసారం చేసారని తెలిపాడు. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా తమ దగ్గర ఉన్నట్లు ట్వీట్ చేసాడు ఈయన. ఎవ్రీ అనే లోకల్ తెలుగు ఛానెల్‌లో అక్రమంగా కెజియఫ్ ప్రసారం చేసిందని చెప్పాడాయన.

కేజీఎఫ్ మూవీలో యశ్ (Yash)
కేజీఎఫ్ మూవీలో యశ్ (Yash)


వాళ్లపై చట్టపరంగా నష్టపరిహారం దావా వేస్తున్నామని తెలిపాడు. ఓ వైపు శాటిలైట్ హక్కుల విషయం కొలిక్కి వస్తుందనే విషయం తెలిసి కూడా చానెల్ ప్రసారం చేయడం దారుణం అని చెప్పాడు ఈయన. తమ దగ్గర ఆ ఛానెల్‌లో ప్రసారమైనట్టు స్క్రీన్ షాట్స్, వీడియోలు ఉన్నాయని తెలిపాడు కార్తిక్ గౌడ. సినిమా విడుదలై ఏడాదిన్నర గడిచినా కూడా ఇప్పటి వరకు కెజియఫ్ తెలుగు హక్కులను ఏ డిజిటల్ ఛానెల్‌కు కూడా ఇవ్వలేదు.


టెలివిజన్ ప్రీమియర్‌కు కూడా ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఇలా నిర్మాతల నుంచి అనుమతి లేకుండా ఎవ్రీ ఛానెల్ ప్రసారం చేసిందని తెలిపాడు ఈయన. దీనిపై కోర్టు నుంచి లీగల్ నోటీసుల పంపుతామని.. సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పాడు కార్తిక్. ఇలాంటి నీచమైన సంస్క‌ృతి లోకల్ చానెల్స్‌లో ఉందని.. శాటిలైట్ రైట్స్‌పై, డిజటల్ హక్కులపై కనీస గౌరవం కూడా ఉండదని ఆయన తెలిపాడు. మరి ఈ వ్యవహారం ఎంతదూరం వెళ్తుందో చూడాలిక.
First published: May 9, 2020, 10:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading