• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KGF HERO GETTING LIFE THREATS HERE ARE THE COMMENTS BY YASH SR

KGF హీరోను చంపడానికి కుట్ర జరుగుతోందా..!

KGF హీరోను చంపడానికి కుట్ర జరుగుతోందా..!

కెజియఫ్ ఛాప్టర్ 1 (KGF)

కన్నడ ఫిల్మ్ KGF బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. ఆ సినిమాలో యశ్.. తన నటనతో యావత్ దేశాన్ని అలరించారు..అయితే తాజాగా ఆయనను చంపడానికి కొందరు ప్లాన్స్ వేస్తున్నారని కొన్ని కథనాలు వచ్చాయి..వీటిపై యశ్ స్పందిస్తూ తనపై జరుగుతున్న హత్య ప్రయత్నం గురించి.. స్పష్టం చేశాడు.

  • Share this:
    కన్నడ ఫిల్మ్ KGF బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. యశ్ ప్రధాన పాత్రలో బంగారు గనుల కథాంశంతో రిలీజైన ఈ సినిమా... విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్ మార్క్‌తో సెన్సేషన్ సృష్టించింది.  ఈ సినిమాలో యశ్..తన మాస్ నటనతో యావత్ దేశాన్ని ఆకట్టుకున్నారు.  అయితే ఇటీవల యశ్‌ను చంపబోతున్నారని..కన్నడ చానల్స్ కథనాలు అల్లాయి..దీనిపై స్పందించిన యశ్.. మట్లాడుతూ.. తనని ఎవ్వరూ చంపాలని అనుకోవడంలేదని.. కాని..ఇలాంటీ కథనాలతో తన అభిమానులు, కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆయన మాట్లాడుతూ..  ‘నన్నెవ్వరూ చంపాలనుకోవడంలేదు. నేను బెంగళూరు ఏసీపీతో కూడా మాట్లాడాను. నాపై ఎలాంటి కుట్ర జరగడంలేదని ఆయన స్పష్టంచేశారు. ఈ వదంతుల కారణంగా నా కుటుంబం భయపడుతోందన్నారు. ఈ కథనాల వల్ల.. ఉదయం నుంచి నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. మున్ముందు వీటి వల్ల ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని భయంగా ఉందని అన్నారు.

    KGF‌లో యశ్, తమన్నా Photo: Twitter/TheNameIsYash
    KGF‌లో యశ్, తమన్నా Photo: Twitter/TheNameIsYash


    యశ్ మాట్లాడుతూ.. ఎవరైనా ఓ గ్యాంగ్‌స్టర్‌ అరెస్టయ్యాడంటే నా లైఫ్‌కు రిస్క్‌ ఉందని అనేస్తున్నారు. నేనేం గొర్రెను కాను. ఎవడుపడితే వాడు వచ్చి నరికేయడానికి అని... నా సామర్ధ్యం ఏంటో నాకు తెలుసు అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. అసలు ఈ విషయాలన్నీ మీడియాకు ఎవరు చేరవేస్తున్నారో నాకు తెలీడంలేదని...అసహనం వ్యక్తం చేశారు.

    అదిరిపోయిన పూజ హెగ్డే లేటెస్ట్‌ హాట్ ఫోటోస్
    First published: