Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: November 21, 2019, 8:18 AM IST
మహేష్ బాబు,జూనియర్ ఎన్టీఆర్,ప్రభాస్ (twitter/Photos)
అవును ఎన్టీఆర్, మహేష్ బాబు తర్వాత ఇపుడు ప్రభాస్ వంతు వచ్చింది. ఇంతకీ మ్యాటరేంటేంటే.. కన్నడలో యశ్ హీరోగా కేజీఎఫ్ సినిమాతో హోల్ ఇండియా పాపులర్ అయ్యాడు. ‘కేజీఎఫ్’ సక్సెస్‌తో ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేయడానికి తెలుగుతో పాటు తమిళంలోని అగ్ర హీరోలందరు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ 2 సినిమాను తెరకెక్కిస్తోన్న ప్రశాంత్ నీల్.. ఈ సినిమా తర్వాత ఆల్రెడీ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయడానికి ఆల్రెడీ కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఆయా హీరోలకు ఓ లైన్ చెప్పి సినిమాలను ఓకే చేయించుకున్నాడు. తాజాగా ఈ యంగ్ డైనమిక్ డైరెక్టర్.. ప్రభాస్‌ను కలిసి ఒక డిఫరెంట్ కథతో ఇంప్రెస్ చేసినట్టు చెబుతున్నారు. దానికి యంగ్ రెబల్ స్టార్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

ప్రశాంత్ నీల్.మహేష్,ఎన్టీఆర్,ప్రభాస్ (file photos)
ముందుగా ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ 2 తర్వాత మహేష్ బాబుతో నెక్ట్స్ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కనుంది. ఈ రెండు సినిమాలు కంప్లీటైన తర్వాత కానీ ప్రభాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ కానీకీ ఎంత లేదన్న యేడాదిన్నరకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఏమైనా కన్నడలో కేజీఎఫ్‌తో సత్తా చూపెట్టిన ఈ దర్శకుడు ఇపుడు తెలుగులో వరుసగా అగ్ర హీరోల సినిమాలను డైరెక్ట్ చేసే అవకాశం అందుకోవడం విశేషమనే చెప్పాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 21, 2019, 8:18 AM IST