‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్..నెక్ట్స్ మూవీ ఏ దర్శకుడితో తెలుసా..

ప్రస్తుతం ఎన్టీఆర్..రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తారక్.. ఆర్ఆర్ఆర్ తప్ప మరో సినిమా ఆలోచించే పరిస్థితి లేదు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ ఏ దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయాలనే దానిపై ఇప్పటికీ మిస్టరీలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్..తన తర్వాతి సినిమాను ఏ దర్శకుడితో ఎటువంటి సబ్జెక్ట్‌తో చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది.

news18-telugu
Updated: July 7, 2019, 7:01 PM IST
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్..నెక్ట్స్ మూవీ ఏ దర్శకుడితో తెలుసా..
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ (ఫ్యాన్ మేడ్ పోస్టర్ కమ్ ట్విట్టర్ ఫోటోస్)
  • Share this:
ప్రస్తుతం ఎన్టీఆర్..రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తారక్.. ఆర్ఆర్ఆర్ తప్ప మరో సినిమా ఆలోచించే పరిస్థితి లేదు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ ఏ దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయాలనే దానిపై ఇప్పటికీ మిస్టరీలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్..తన తర్వాతి సినిమాను ఏ దర్శకుడితో ఎటువంటి సబ్జెక్ట్‌తో చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా సమయంలో త్రివిక్రమ్ టేకింగ్‌కు ఫిదా అయిన ఎన్టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని ఉబలాటపడతున్నట్టు.. తారక్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ‘జనతా గ్యారేజ్’ సినిమా టైమ్‌లోనే మైత్రీ మూవీ మేకర్స్ తారక్‌తో మరో సినిమాకు కమిట్‌మెంట్ తీసుకుంది. కాకపోతే దీనికీ టైమ్ లిమిట్ అంటూ ఏది లేదు. మరోవైపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌కు ఒక సినిమా చేస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఒక కేజీఎఫ్ సెకండ్ పార్ట్ రిలీజ్ సమయానికి ఇటు ఎన్టీఆర్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్‌ నుంచి ఫ్రీ అయితాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమా తెరకెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Rajamouli Planning to release the RRR 1st look of Jr NTR as Komaram Bheem on his birthday May 20 pk.. ఈ సారి జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉండ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని త‌న అభిమానుల‌కు కూడా చెప్పాడు ఎన్టీఆర్. తండ్రి హ‌రికృష్ణ మ‌ర‌ణం కార‌ణంగా ఈ పుట్టిన రోజు వేడుక‌లు చేసుకోకూడ‌ద‌ని ఫిక్సైపోయాడు ఎన్టీఆర్. rrr movie,rrr movie updates,rrr movie teaser,rrr movie jr ntr 1st look,rrr jr ntr komaram bheem look,rrr movie first look,jr ntr birthday look rrr,rrr teaser,jr ntr birthday,rrr movie first look teaser,rrr movie latest news,jr ntr twitter,rrr press meet,jr ntr instagram,rrr movie press meet,rrr new movie,rrr first look poster,rrr movie latest updates,rrr telugu movie,jr ntr first look in rrr,ram charan first look in rrr,telugu cinema,రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్,జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్,జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే,రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,తెలుగు సినిమా
కొమరం భీమ్ జూనియర్ ఎన్టీఆర్


ఇంకోవైపు దర్శకుడిగా ఫామ్ కోల్పోయిన వి.వి.వినాయక్ కూడా ‘అదుర్స్’ సీక్వెల్ గురించి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. కానీ తారక్ మాత్రం రిస్క్ తీసుకునే స్థితిలో లేడు.‘టెంపర్’ నుంచి మొదలైన సక్సెస్ ట్రాక్‌ ఎక్కిన ఎన్టీఆర్.. ‘అరవింద సమేత వీర రాఘవ’ వరకు అపజయం అంటూ లేకుండా దూసుకుపోతున్నాడు. కనుక వినాయక్‌తో చేసే ప్రసక్తి లేదంటున్నారు. మరోవైపు కొరటాల శివతో తారక్ ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు. అంతేకాదు మరోసారి వీళ్లిద్దరి కాంబోలో ఒక సినిమా ఉంటుందనే అనౌన్స్ జరిగినా.. ఎక్కడ చడీ చప్పుడు లేదు.ఒక వేళ చిరంజీవి 152వ సినిమా తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివతో మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ .. ఏ దర్శకుడితో ఎటువంటి సబ్జెక్ట్‌తో సినిమా చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది.

 

First published: July 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు