KGF Chapter 2 Poster : వైకింగ్స్ స్టైల్లో భయానకంగా అధీరా లుక్..

#KGFChapter2 #AdheeraFirstLook : కన్నడ సినిమా కెజిఎఫ్ బాక్స్ ఆఫీస్‌ను ఎంతలా షేక్ చేసిందో చెప్పనక్కర లేదు. ఆ సినిమాలో పాటలు, ఫైట్స్, డైలాగులు ఓ రేంజ్‌లో పేలాయి.

news18-telugu
Updated: July 29, 2020, 11:35 AM IST
KGF Chapter 2 Poster : వైకింగ్స్ స్టైల్లో భయానకంగా అధీరా లుక్..
అధీరా ఫస్ట్ లుక్ Photo : Twitter
  • Share this:
కన్నడ సినిమా కెజిఎఫ్ బాక్స్ ఆఫీస్‌ను ఎంతలా షేక్ చేసిందో చెప్పనక్కర లేదు. ఆ సినిమాలో పాటలు, ఫైట్స్, డైలాగులు ఓ రేంజ్‌లో పేలాయి. దీంతో ఈ సినిమా సీక్వెల్‌గా దేశ వ్యాప్తంగా యమ క్రేజ్ వచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇటూ మాస్‌తో పాటు క్లాస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంది. దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషాల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లను సాధించింది. దీంతో అదే ఊపు మీదున్న చిత్రబృందం ప్రస్తుతం కెజిఎఫ్ సినిమాకు సీక్వెల్ గా కెజిఎఫ్ 2తెరకెక్కిస్తోంది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇవేమీ ఈ సినిమాను ఆపలేకపోయాయి.


ఇప్పటికే చాప్టర్ 2 కి సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన లుక్‌ను విడుదల చేసింది. సంజయ్ దత్ అధిరా లుక్‌లో అదరగొడుతున్నాడు. ఆయన లుక్ విషయానికి వస్తే.. కొంచెం గుండుతో ఓ కత్తి పట్టుకుని కూర్చుని.. వైకింగ్స్ స్టైల్లో అదిరిపోయింది. ఆ లుక్‌లో ఆయన హెయిర్ స్టైల్, గడ్డంతో భయంకరంగా ఉన్నాడు. కెజిఎఫ్2 లో రాఖీ భాయ్ రోల్ చేస్తున్న యష్ కి అధీరాగా చేస్తున్న సంజయ్ దత్ కి మధ్య పోరాటాలు ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 23న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Published by: Suresh Rachamalla
First published: July 29, 2020, 11:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading