KGF Chapter 2: కెజియఫ్ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్..

KGF Chapter 2: ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న డేట్ వచ్చేసింది. కెజియఫ్ 2 సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయిపోయింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో కెజియఫ్ 2 ఒకేరోజు విడుదలవుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 13, 2020, 6:02 PM IST
KGF Chapter 2: కెజియఫ్ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్..
కెజియఫ్ 2 (KGF Chapter 2 release date)
  • Share this:
ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న డేట్ వచ్చేసింది. కెజియఫ్ 2 సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకటి రెండు కాదు.. ఐదు భాషల్లో ఈ సినిమా ఒకేరోజు విడుదల కాబోతుంది. నిజంగా వాళ్లు సినిమా ఈ స్థాయి విజయం సాధిస్తుందని అనుకోలేదేమో..? ఎందుకంటే తొలిభాగం సృష్టించిన సంచలనాలు చూస్తుంటే ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం లేదు. ఈ సినిమా 230 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలాంటి సమయంలో కెజియఫ్ చాప్టర్ 2 కోసమని అన్ని ఇండస్ట్రీల‌ నుంచి భారీ పోటీ ఉంది. దాంతో బిజినెస్ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్ట్ 2 బిజినెస్ ఇప్పుడే పూర్తి చేయకూడదని వాళ్లు ఫిక్స్ అయిపోయారు.
కెజియఫ్ 2 రిలీజ్ డేట్ (KGF Chapter 2 release date)
కెజియఫ్ 2 రిలీజ్ డేట్ (KGF Chapter 2 release date)


నెమ్మదిగా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత గానీ అసలు బిజినెస్ మొదలుపెట్టాలి అని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. దానికి కారణం కూడా లేకపోలేదు. అప్పటి వరకు ట్రైలర్స్, టీజర్స్ విడుదలవుతాయి కాబట్టి ఇంకా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అని వాళ్ళ అంచనా. అందుకే ఇప్పుడే సినిమా అమ్మ‌కూడదని వాళ్లు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. పైగా చాప్టర్ 1 సృష్టించిన సంచలనాలు చూసి చాప్టర్ 2 కోసం మూడింతలు రెట్లు ఎక్కువగా ఇస్తామంటూ వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు.
కెజియఫ్ 2 రిలీజ్ డేట్ (KGF Chapter 2 release date)
కెజియఫ్ 2 రిలీజ్ డేట్ (KGF Chapter 2 release date)

తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తమిళనాట కూడా 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక హిందీలో 40 కోట్ల వరకు రాబట్టింది. దాంతో రెండో భాగానికి భారీ ఆఫర్స్ వస్తున్నా కానీ నిర్మాతలు మాత్రం అస్సలు టెంప్ట్ కావడం లేదు. సినిమా పూర్తయిన తర్వాత కానీ అమ్మకూడ‌దని నిర్ణ‌యం తీసుకుంటున్నారు. ప‌్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో య‌శ్ హీరోగా న‌టించాడు. బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. అక్టోబర్ 23న ఈ సినిమా విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో కెజియఫ్ 2 ఒకేరోజు విడుదలవుతుంది.

KGF 2 కొత్త పోస్టర్ (KGF 2 Movie)
KGF 2 కొత్త పోస్టర్ (KGF 2 Movie)


ఇదిలా ఉంటే ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలు హైదరాబాద్‌లోనే ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్. ఆర్ఎఫ్‌సీలో ప్రత్యేకంగా ఈ చిత్రం కోసమే సెట్ నిర్మిస్తున్నారు. అందులోనే విలన్ సంజయ్ దత్, హీరో యష్ మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నాడు దర్శకుడు. ముఖ్యంగా ఇద్దరూ షర్ట్ లేకుండా ఫైట్ చేసుకుంటారని తెలుస్తుంది. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్స్ పని చేస్తున్నారు. తెలుగులో కెజియఫ్ 2 రైట్స్ దాదాపు 30 కోట్ల వరకు పలికినట్లు తెలుస్తుంది.
First published: March 13, 2020, 6:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading