KGF Chapter 2: కేజీఎఫ్-2లో మీకు నటించాలని ఉందా? రేపే ఆడిషన్స్

KGF Chapter 2 Auditions | కేజీఎఫ్ చాప్టర్ 2లో మీకూ నటించే అవకాశం కల్పిస్తున్నారు చిత్ర నిర్మాతలు. మీరు కూడా మీ టాలెంట్ చూపించి కేజీఎఫ్ 2లో నటించొచ్చు.

news18-telugu
Updated: April 25, 2019, 11:46 AM IST
KGF Chapter 2: కేజీఎఫ్-2లో మీకు నటించాలని ఉందా? రేపే ఆడిషన్స్
KGF Chapter 2: కేజీఎఫ్-2లో మీకు నటించాలని ఉందా? రేపే ఆడిషన్స్ (image: @prashanth_neel/Twitter)
  • Share this:
మీకు యాక్టర్ కావాలనుందా? కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలో నటించాలని ఉందా? ఈ అవకాశం మీకోసమే. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు నిర్మాతలు. కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా రంగంలో సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. ఈ కన్నడ సినిమా తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో రిలీజై ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇది చాప్టర్ 1 మాత్రమే. అంటే సినిమా మొదటి భాగమే. రెండో భాగం కూడా ఉంది. KGF Chapter 2 పేరుతో రిలీజ్ కానుంది. సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కేజీఎఫ్ 2 సినిమాపై భారీ అంచనాలున్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 2లో మీకూ నటించే అవకాశం కల్పిస్తున్నారు చిత్ర నిర్మాతలు. మీరు కూడా మీ టాలెంట్ చూపించి కేజీఎఫ్ 2లో నటించొచ్చు.


ఏప్రిల్ 26న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేజీఎఫ్ 2 కోసం ఆడిషన్స్ జరగనున్నాయి. 8 నుంచి 16 ఏళ్ల అబ్బాయిలు, 25 ఏళ్లు దాటిన యువకులు ఆడిషన్‌లో పాల్గొనొచ్చు. ఆడిషన్స్ బెంగళూరులోని డిజిటల్ ఆడిటోరియంలో జరగనున్నాయి. ఈ ఆడిషన్‌లో పాల్గొనడానికి మీరు చేయాల్సిందల్లా ఒక నిమిషం డైలాగ్ ఏదైనా బాగా ప్రిపేర్ కావడమే. మీరు ప్రిపేర్ అయిన డైలాగ్‌ను చెప్పి కేజీఎఫ్ టీమ్‌ను మెప్పిస్తే చాలు... కేజీఎఫ్ చాప్టర్ 2 లో నటించే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే కేజీఎఫ్ 2లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. మీరు మీ టాలెంట్ చూపించారంటే కేజీఎఫ్‌ 2 లో నటించే అవకాశం రావొచ్చు.



Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3
ఇవి కూడా చదవండి:

Jio Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ జియో యాప్స్ ఉన్నాయా? ఉపయోగాలు తెలుసుకోండి

Tata Sky New Packs: డీటీహెచ్ ప్లాన్స్‌ ధరల్ని తగ్గించిన టాటా స్కై... కొత్త తెలుగు ప్యాక్స్ ఇవే

SBI New Rules: మే 1 నుంచి ఎస్‌బీఐలో మారనున్న రూల్స్ ఇవే...

 
First published: April 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు