హోమ్ /వార్తలు /సినిమా /

KGF Chapter 2 Twitter Review : కేజీఎఫ్ ఛాప్టర్ 2 ట్విట్టర్ రివ్యూ.. రాఖీ భాయ్ చెలరేగిపోయాడా..

KGF Chapter 2 Twitter Review : కేజీఎఫ్ ఛాప్టర్ 2 ట్విట్టర్ రివ్యూ.. రాఖీ భాయ్ చెలరేగిపోయాడా..

KGF Chapter 2 ట్విట్టర్ రివ్యూ (KGF Chapter 2 Photo : Twitter)

KGF Chapter 2 ట్విట్టర్ రివ్యూ (KGF Chapter 2 Photo : Twitter)

KGF Chapter 2 Twitter Review :  యశ, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘కేజీఎఫ్ 1. ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో ఈ సినిమాకు రెండో పార్ట్‌గా వచ్చిన రెండో సినిమా కేజీఎఫ్ 2 ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉంది.. పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో మన ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...

KGF Chapter 2 Twitter Review : కేజీఎఫ్ అనే ఒక్క సినిమా ఒక్క సినిమాతో హీరోగా  యశ్  కెరీర్ పూర్తిగా మారిపోయింది. మూడేళ్ల కింది వరకు ఈయన కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో. రాఖీ భాయ్ గురించి తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో..? కెజియఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో ఈయన రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియన్ రేంజ్‌లో తన మార్కెట్ పెంచుకున్నాడు యశ్. తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ వచ్చింది. తాజాగా ఈరోజు కేజీఎఫ్ 2 మూవీతో పలకరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 10 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. ఓ కన్నడ సినిమా ఇన్ని స్క్రీన్స్‌లో విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. కెజియఫ్ 2కు తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరగని బిజనెస్ చేసింది. ఇప్పటికే ఓవర్సీస్‌ సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. ఇక ఈ మూవీ ఎలా ఉందో పబ్లిక్ టాక్ ఎలా ఉందో మన ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..

మొత్తంగా కేజీెఫ్ 2 మరోసారి యశ్ యాక్షన్‌తో అదరగొట్టేసినట్టు చెబుతారు.అంతేకాదు యాక్షన్ సీన్స్‌లో మరోసారి యశ్ అదరగొట్టేసినట్టు సమాచారం. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టడం పక్కా అని చెబుతారు.

తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 79 కోట్ల రాబట్టాలి. ఇప్పటి వరకు తెలుగులో విడుదలైన డబ్బింగ్ సినిమాల్లో ఇది ఒక రికార్డు అని చెప్పాలి. హైయ్యెస్ట్ రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. కేజీఎఫ్ సినిమా విషయానికస్తే.. 70,80ల్లో కర్ణాటకలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు.KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు నటించారు.

ఇక వివిధ ఏరియాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

కర్ణాటక :  రూ. 100 కోట్లు

తెలుగు : రూ. 78 కోట్లు

తమిళ్ : రూ. 27 కోట్లు

కేరళ : రూ. 10 కోట్లు

హిందీ + రెస్టాఫ్ భారత్ : రూ. 100 కోట్లు

ఓవర్సీస్ : రూ. 30 కోట్లు

టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

KGF 2లో ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్‌తో అథీరా పాత్ర కోసం తీసుకున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. ఇక అన్ని భాషల్లో డిజిటల్, శాటిలైట్ రైట్స్ అదనం.   ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యశ్ డబ్బింగ్ పూర్తైయింది. మరోవైపు హిందీలో కూడా యశ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్టు సమాచారం. మొత్తంగా మొదటి భాగం హిట్టైయినట్టే.. కేజీఎఫ్ 2 ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

First published:

Tags: KGF Chapter 2, Prashanth Neel, Raveena Tandon, Sandalwood, Sanjay Dutt, Yash