KGF Chapter 2 Trailer: తెలుగులో రాజమౌళి (Rajamouli) సినిమా వచ్చినపుడు ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి.. అచ్చంగా ఇప్పుడు ఇలాగే వైబ్రేషన్ పుట్టిస్తున్నాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ఈయన తెరకెక్కిస్తున్న కెజియఫ్ 2 (KGF Chapter 2) సినిమా షూటింగ్ ఎప్రిల్ 14న విడుదల కానుంది.
తెలుగులో రాజమౌళి (Rajamouli) సినిమా వచ్చినపుడు ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి.. అచ్చంగా ఇప్పుడు ఇలాగే వైబ్రేషన్ పుట్టిస్తున్నాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ఈయన తెరకెక్కిస్తున్న కెజియఫ్ 2 (KGF Chapter 2) సినిమా షూటింగ్ ఎప్రిల్ 14న విడుదల కానుంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది కింద విడుదలైన టీజర్ 240 మిలియన్స్‌కు పైగా వ్యూస్ అందుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ట్రైలర్ విడుదలైంది. ఇది కూడా అదిరిపోయింది. మొదటి భాగాన్ని మించేలా రెండో పార్ట్ తెరకెక్కించాడని అర్థమవుతుంది. ముఖ్యంగా ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చే మూవెంట్స్ చాలానే కనిపిస్తున్నాయి. కచ్చితంగా రేపు థియేటర్స్‌లో రాఖీ భాయ్ రచ్చకు రికార్డులు బద్ధలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ముందు కన్నడ సినిమాగానే మొదలైనా కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాకు బాప్‌గా మారిపోయింది కెజియఫ్ 2.
బాహుబలి తర్వాత ఓ సినిమా రెండో భాగం కోసం ప్రేక్షకులు అంతగా వేచి చూస్తున్నది ఈ సినిమా కోసమే. ఛాప్టర్ 1 ఇంత విజయం సాధిస్తుందని నిజంగా వాళ్లు కూడా ఊహించలేదేమో..? కెజియఫ్ 1 ఏకంగా 230 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలాంటి సమయంలో కెజియఫ్ చాప్టర్ 2 కోసమని అన్ని ఇండస్ట్రీల నుంచి భారీ పోటీ ఉంది. దాంతో బిజినెస్ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్ట్ 2 బిజినెస్ 250 కోట్లకు పైగానే జరుగుతుంది. ఇప్పుడు ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత పెరిగిపోయాయి. బిజినెస్ రేంజ్ కూడా భారీగానే జరుగుతుంది.
చాప్టర్ 1 సృష్టించిన సంచలనాలు చూసి చాప్టర్ 2 కోసం మూడింతలు రెట్లు ఎక్కువగా ఇస్తామంటూ వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే 21 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తమిళనాట కూడా 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక హిందీలో 40 కోట్ల వరకు రాబట్టింది. దాంతో రెండో భాగానికి భారీ ఆఫర్స్ వచ్చాయి. కెజియఫ్ 2 ట్రైలర్‌ను బర్త్ డే బాయ్ రామ్ చరణ్ విడుదల చేసాడు. నాకు వయోలెన్స్ నచ్చదు.. కానీ వయోలెన్స్‌కు నేను నచ్చుతాను.. అందుకే నేను వదిలినా అది వదలదు నన్ను అంటూ యష్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. బిజినెస్ చేద్దామా.. ఆఫర్ క్లోజెస్ సూన్ అంటూ మరో డైలాగుతో రచ్చ చేసాడు ఈయన.
ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. అలాగే కన్నడ వెర్షన్ ట్రైలర్‌ను శివరాజ్ కుమార్, హిందీ ట్రైలర్‌ను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్, తమిళ వెర్షన్‌ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ ట్రైలర్‌ను పృథ్విరాజ్ సుకుమారన్ విడుదల చేసారు. ఏప్రిల్ 14న కన్నడతో పాటు అన్ని భాషల్లో ఒకేరోజు విడుదల కానుంది ఈ చిత్రం. వివిధ భాషల్లో విడుదలవుతుంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగండూర్ తెరకెక్కిస్తున్న కెజియఫ్ 2లో బాలీవుడ్ నటులు రవీనా టండన్, సంజయ్ దత్ ఉన్నారు. కన్నడ నటి శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.