KGF Chapter 2 Trailer 2 | కేజీఎఫ్ అనే ఒక్క సినిమా ఒక్క సినిమాతో కెరీర్ పూర్తిగా మారిపోవడానికి. ఇక యశ్ విషయంలో అదే జరిగింది. తాజాగా ఈ సినిమా నుంచి తుపాన్ సాంగ్‌ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ దక్కించుకోంటోంది.
KGF Chapter 2 Trailer 2 | కేజీఎఫ్ అనే ఒక్క సినిమా ఒక్క సినిమాతో కెరీర్ పూర్తిగా మారిపోవడానికి. ఇక యశ్ విషయంలో అదే జరిగింది. మూడేళ్ల కింది వరకు ఈయన కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో. రాఖీ భాయ్ గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో..? కెజియఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో ఈయన రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియన్ రేంజ్లో తన మార్కెట్ పెంచుకున్నాడు యశ్. తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ వచ్చింది. త్వరలోనే ఈయన కేజీఎఫ్ 2 మూవీతో పలకరించనున్నారు. కెజియఫ్ 2కు ఏకంగా రూ. 50 కోట్లకు పైగానే రైట్స్ కోసం చెల్లించారంటే రేంజ్ అర్థం చేసుకోవచ్చు. యశ్ ఇప్పుడు కన్నడలో నెంబర్ వన్ హీరో. అక్కడ తొలి రూ. 200 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసిన హీరో.
భారీ అంచనాలతో వచ్చిన కెజియఫ్.. అంతకంటే భారీగా వసూలు చేసింది.. అన్ని ఇండస్ట్రీలో విజయ బావుటా ఎగరవేసింది. తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కెజియఫ్ రూ. 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కేజీఎఫ్ 2 నుంచి తుఫాన్ సాంగ్ విడుదల చేసారు. ఈ సాంగ్‌లో యశ్ .. హీరోయిజం ఎలివేషన్ ఓ రేంజ్లో ఉంది. ఈ పాటను చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ పాటను రామజోగయ్య రాసారు. రవి బసూర్ సంగీతం అందించారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఈ నెల 27న సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు మరోసారి ఏప్రిల్ 14నే ఈ సినిమా విడుదల చేయడం పక్కా అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ ట్రైలర్‌ను ఐదు భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్‌కు అంతా సిద్ధమైంది.
కేజీఎఫ్ 2 తుఫాన్ సాంగ్ (Twitter/Photo)
కేజీఎఫ్ సినిమా విషయానికస్తే.. 70,80ల్లో కర్ణాటకలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు.KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు నటిస్తున్నారు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 1లో మెయిన్ విలన్ బ్రదర్ పాత్రలో అధీరా అనే పాత్రను చూపించారు. కానీ ఆ క్యారెక్టర్ చేసింది ఎవరో రివీల్ చేయలేదు.
KGF 2లో ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్తో అథీరా పాత్ర కోసం తీసుకున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. ఇక అన్ని భాషల్లో డిజిటల్, శాటిలైట్ రైట్స్ అదనం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యశ్ డబ్బింగ్ పూర్తైయింది. మరోవైపు హిందీలో కూడా యశ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్టు సమాచారం. మొత్తంగా మొదటి భాగం హిట్టైయినట్టే.. కేజీఎఫ్ 2 ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.