షూటింగ్స్‌కు కేంద్రం అనుమతి ఇవ్వడంతో కొందరు ధైర్యం చేసి ముందడుగు వేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పెద్ద సినిమాలేవీ కదల్లేదని అంతా అనుకుంటున్న తరుణంలో కెజిఎఫ్ 2 షూటింగ్ మొదలు పెట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. బెంగళూరు సమీపంలో ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభించారు. చాలా తక్కువ మంది సమక్షంలోనే ఈ షూటింగ్ మొదలైంది. తొలిరోజు షూటింగ్‌లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నాడు.
కెజిఎఫ్ తొలి భాగంలో ఈయన లేడు కానీ రెండో భాగంలోకి వచ్చాడు. అనంత్ నాగ్ పార్ట్ 2 నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో ప్రకాశ్ రాజ్‌ను తీసుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. తొలి భాగం అంతా అనంత్ నాగ్ ఓ జర్నలిస్టుకు చెప్తుంటాడు. ఇప్పుడు అదే పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వర్కింగ్ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి.
Start Camera..Action... BACK TO WORK.. pic.twitter.com/LzFFhJrsjG
— Prakash Raj (@prakashraaj) August 26, 2020
వీళ్లొచ్చారు కానీ యశ్‌తో పాటు సంజయ్ దత్ లాంటి స్టార్ యాక్టర్స్ ఎప్పుడు వస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. క్లైమాక్స్ మినహా మిగిలిన షూటింగ్ 10 రోజుల్లో పూర్తి చేస్తానని ప్రకటించాడు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత క్లైమాక్స్ ప్లాన్ చేయనున్నాడు. 2021లోనే కెజిఎఫ్ 2 విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kannada Cinema, KGF Chapter 2, Telugu Cinema