KGF CHAPTER 2 PRE RELEASE BUSINESS AND YASH RECREATING HISTORY IN SOUTH CINEMA PK
KGF Chapter 2 Telugu Rights: ‘కెజియఫ్ 2’ రైట్స్ దిల్ రాజు ఎంతకు కొన్నాడో తెలిస్తే గుండె ఆగిపోతుంది..!
కెజియఫ్ 2 రిలీజ్ డేట్ (kgf chapter 2)
KGF Chapter 2: కెజియఫ్ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎలాంటి అంచనాలు ఉన్నాయనేది చెప్పనక్కర్లేదు. ఊరు పేరు తెలియకుండా మొదటిభాగం విడుదలైంది. కానీ సంచలన విజయం సాధించింది. కెజియఫ్ సృష్టించిన సంచలనాలు ఇంకా..
కెజియఫ్ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎలాంటి అంచనాలు ఉన్నాయనేది చెప్పనక్కర్లేదు. ఊరు పేరు తెలియకుండా మొదటిభాగం విడుదలైంది. కానీ సంచలన విజయం సాధించింది. కెజియఫ్ సృష్టించిన సంచలనాలు ఇంకా ఎవరూ మరిచిపోలేదు కూడా. దాంతో రెండో భాగం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు అభిమానులు. మధ్యలో కరోనా వచ్చింది కానీ లేదంటే మాత్రం గతేడాదే సినిమా విడుదలై ఉండేది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఆకాశంలో ఉంది. నిర్మాతలు చెప్తున్న రేట్స్ విన్న తర్వాత బయ్యర్లకు వణుకు పుడుతుందని తెలుస్తుంది. కాస్త అతిగానే రేట్స్ కోట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. తెలుగులో ఈ సినిమా రైట్స్ కోసం ఏఖంగా 70 కోట్లు కోట్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. తెలుగులో 70 కోట్లు అనేది చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద హీరోల సినిమాలకు ఆ స్థాయిలో ఇక్కడ బిజినెస్ జరుగుతుంటుంది. టాలీవుడ్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు ఇప్పుడు ఈ స్థాయి బిజినెస్ చేస్తున్నారు. అలాంటి రేట్ ఇప్పుడు కెజియఫ్ 2 కోసం చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. అయినా కూడా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని సినిమాను 66 కోట్లకు దిల్ రాజు హక్కులను సొంతం చేసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. తొలిభాగం కేవలం 5 కోట్లు మాత్రమే అమ్ముడైంది. అలాంటిది రెండో భాగం దాని కంటే 11 రెట్లు ఎక్కువ పలుకుతుంది. మరోవైపు కన్నడలో 100 కోట్ల సోలో బిజినెస్ జరుగుతుంది.
కెజియఫ్ 2 రిలీజ్ డేట్ (kgf chapter 2)
తమిళంలో 30 కోట్ల వరకు జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఓవర్సీస్లో అయితే 80 కోట్ల వరకు కోట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎలా చూసుకున్నా కూడా అన్ని భాషలలో కలిసి కెజియఫ్ 2 ఏకంగా 240 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇంత వసూలు చేయాలంటే సినిమా 300 కోట్లు షేర్ వసూలు చేయాలి. అంత దమ్ము ఈ సినిమాలో ఉందో లేదో జులై 16న తెలియనుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.