Home /News /movies /

KGF CHAPTER 2 MAKERS UNVEIL NEW POSTER OF ADHEERA RELEASED ON HIS SANJAY DUTT BIRTHDAY TA

KGF Chapter 2 - Sanjay Dutt: కేజీఎఫ్ 2 నుంచి అథిరాగా సంజయ్ దత్ కొత్త లుక్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్..

కేజీఎఫ్2లో అథీరాగా సంజయ్ దత్ మరో లుక్ (Twitter/Photo)

కేజీఎఫ్2లో అథీరాగా సంజయ్ దత్ మరో లుక్ (Twitter/Photo)

KGF Chapter 2 - Sanjay Dutt:  కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ కన్నడలో తప్ప.. ఏ భాషలో అంతగా అంచనాలు లేవు. కానీ విడుదల తర్వాత ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే కదా. ఈ రోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా మరో లుక్‌ను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
    KGF Chapter 2 - Sanjay Dutt:  కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ కన్నడలో తప్ప.. ఏ భాషలో అంతగా అంచనాలు లేవు. కానీ విడుదల తర్వాత ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే కదా. సౌత్ నుంచి ప్రభాస్ తర్వాత ప్యాన్ ఇండియా హీరోగా యశ్ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కేజీఎఫ్ సినిమా విడుదలైన అన్ని భాషల్లో రికార్డుల మోత మోగించింది. అంతేకాదు కన్నడ సినిమా రేంజ్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ఈ సినిమాను 70,80ల్లో కర్ణాటకలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు తీసుకున్నారు.

    ఇక కేజీఎఫ్ చాప్టర్ 1లో మెయిన్ విలన్ బ్రదర్ పాత్రలో అధీరా అనే పాత్రను చూపించారు. కానీ ఆ క్యారెక్టర్ చేసింది ఎవరో రివీల్ చేయలేదు. ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో ఆ పాత్రను బాలీవుడ్ అగ్ర హీరో సంజయ్ దత్‌తో చేయిస్తున్నారు. ఇప్పటికే అథీరాగా విడుదలైన లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ రోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ‘అథీరా’గా సంజయ్ దత్ మరో లుక్‌ను విడుదల చేశారు.


    మరోవైపు ఈ చిత్రంలో కీలకమైన ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే  విడుదలైన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక అన్ని భాషల్లో డిజిటల్, శాటిలైట్ రైట్స్ అదనం. ఆ సంగతి పక్కన పెడితే..  ఈసినిమాను ముందుగా జూలై 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా కూడా విడుదల వాయిదా పడింది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యశ్ డబ్బింగ్ కూడా మొదలు పెట్టారు. మరోవైపు హిందీలో కూడా యశ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు కేజీఎఫ్ ఛాప్టర్ 1 విడుదలైన  డిసెంబర్‌లోనే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎవరు పోటీలేని టైమ్‌లో కేజీఎఫ్ విడుదలైన డేట్‌లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, KGF Chapter 2, Sandalwood, Sanjay Dutt, Tollywood, Yash

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు