Home /News /movies /

KGF CHAPTER 2 FIRST WEEKEND WORLD WIDE BOX OFFICE COLLECTIONS 4TH DAY YASH AGAIN ROCKING TA

KGF 2 First Weekend WW Collections : కేజీఎఫ్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. రూ. 500 కోట్ల క్లబ్బులో రాఖీ భాయ్ ..

KGF Chapter 2 నాలుగు రోజుల కలెక్షన్స్ (Photo : Twitter)

KGF Chapter 2 నాలుగు రోజుల కలెక్షన్స్ (Photo : Twitter)

KGF Chapter 2 | Yash : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజుల్లోనే నైజాంతో పాటు ఓవర్సీస్, కేరళతో పాటు హిందీలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..

ఇంకా చదవండి ...
KGF Chapter 2 | Yash : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది.  అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ (Yash).. ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది.

ఇక మూడో రోజు కూడా సెన్సేషనల్ కలెక్షన్స్‌ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఈ సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో 10.29 కోట్ల రేంజ్‌లో షేర్‌ను సాధించింది. ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో  రికార్డు స్థాయి రూ.  78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. కెజియఫ్ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 410 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయగా.. 680 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టాలి. నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.81 కోట్ల షేర్ రాబట్టింది. నాలుగవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 61.89 కోట్ల షేర్.. (రూ. 127.25 కోట్ల) గ్రాస్ వసూళ్లను  రాబట్టింది.

నైజాం (తెలంగాణ):  రూ. 28.17 కోట్లు / రూ. 25కోట్లు
సీడెడ్ (రాయలసీమ): రూ.  7.43 కోట్లు  /రూ. 14 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ.  4.82 కోట్లు / రూ. 10  కోట్లు
ఈస్ట్: రూ. 3.56 కోట్లు / రూ. 7 కోట్లు
వెస్ట్: రూ. 2.20 కోట్లు రూ. 6 కోట్లు
గుంటూరు: రూ. 2.97 కోట్లు / రూ. 7 కోట్లు
కృష్ణా: రూ. 2.66 కోట్లు / రూ. 6కోట్లు
నెల్లూరు:రూ. 1.75 కోట్లు / రూ. 3 కోట్లు

  • ఇక వివిధ ఏరియాల్లో ఈ సినిమా ఎంత రాబట్టిందంటే..


కర్ణాటక : రూ. 53.40 కోట్లు (రూ. 91.10 కోట్లు గ్రాస్ ) / రూ. 100 కోట్లు
తెలుగు : రూ. 53.56 కోట్లు (84.80 కోట్లు గ్రాస్ ) / రూ. 78 కోట్లు
తమిళ్ : రూ.15.20 కోట్లు (రూ. 32.10 కోట్లు గ్రాస్) / రూ. 27 కోట్లు
కేరళ : రూ. 12.05 కోట్లు (29.05 కోట్లు గ్రాస్ ) / రూ. 10 కోట్లు
హిందీ + రెస్టాఫ్ భారత్ : రూ. 96.70 కోట్లు (రూ. 223 కోట్లు గ్రాస్) / రూ. 100 కోట్లు
ఓవర్సీస్ : రూ. 46.90 కోట్లు (రూ. 97.40 కోట్లు) / రూ. 30 కోట్లు
టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 277.81 కోట్లు వసూళు చేసింది.

Nagarjuna: ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జున డూప్‌గా నటించింది ఈ స్టార్ హీరోనే.. ఇంత ఎవరో తెలుసా..


ఈ సినిమా తెలుగులో రూ. 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 79 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 53.56 కోట్లు (రూ. 84.80 కోట్ల గ్రాస్) వసూళ్లు రాబట్టింది. మొత్తంగా రూ. 277.17 కోట్ల షేర్ (రూ. 557.45 కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. నాలుగు రోజుల్లో రూ. 277.17 కోట్ల షేర్ (557.45 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి మరో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు 67.83 కోట్ల దూరంలో ఉంది. ఇప్పటికే కేరళ, ఓవర్సీస్, హిందీ, రెస్టాఫ్ భారత్ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తై లాభాల్లో వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నైజాం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఏపీతో  పాటు కర్ణాటక, తమిళనాడులోనే ఈ సినిమా వసూళ్లను రాబట్టాలి. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: KGF Chapter 2, Tollywood, Yash

తదుపరి వార్తలు