హోమ్ /వార్తలు /సినిమా /

KGF 2: కేజీఎఫ్ 2 ఫస్ట్ రివ్యూ.. సీన్స్ అదిరిపోయాయి.. క్లైమాక్స్ షాక్ ఇవ్వడం ఖాయం

KGF 2: కేజీఎఫ్ 2 ఫస్ట్ రివ్యూ.. సీన్స్ అదిరిపోయాయి.. క్లైమాక్స్ షాక్ ఇవ్వడం ఖాయం

కేజీఎఫ్ 2 ఫస్ట్ రివ్యూ

కేజీఎఫ్ 2 ఫస్ట్ రివ్యూ

KGF Chapter 2 First Review: కేజీఎఫ్2 సినిమాపై రివ్యూ రాసిన ప్రముఖ సినీ క్రిటక్ ఉమైర్ సంధు..ఈ చిత్రానికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. అంతే కాదు.. సినిమాలో యష్ నటన టెర్రిఫిక్‌గా ఉందంటూ ప్రశంసించారు.

    సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం కేజీఎఫ్(KGF 2) టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. కన్నడ స్టార్ హీరో యష్(Yash), బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్(Sanjay Dutt) నటించిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 ఈ ఏడాది అత్యధికంగా మాట్లాడుకున్న సినిమాల్లో ఒకటి. ఈ సినిమా ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. కేజీఎఫ్ 2 (KGF 2)అప్ డేట్స్, గాసిప్స్‌తో సోషల్ మీడియా నిండిపోయింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే సమయం వచ్చేసింది. కేజీఎఫ్ చాఫ్టర్ 2 ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయనుంది, అయితే కొంతమందికి ఈ సినిమా ముందుగానే చూసే ఛాన్స్ వచ్చింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమాను చూసే అవకాశం పొందారు ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు.

    సంధు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కేజీఎఫ్ చాఫ్టర్ 2(KGP Chapter2 ) పై రివ్యూ రాశారు. అంతే కాదు ఈ సినిమాకు ఆయన ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు. రివ్యూను షేర్ చేస్తూ... సంధు ఇలా రాశారు. “ఉత్కంఠ రేపే సన్నివేశాలు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్స్ సీన్స్.. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్. డైలాగ్స్, మ్యూజిక్.. బీజీఎం అదిరిపోయింది. యష్ టెరిఫిక్‌గా నటిస్తే.. సంజయ్ దత్ నటన అవుట్ స్టాడింగ్ అంటూ రివ్యూ ఇచ్చేశాడు ఉమైర్ సంధు(Umair Sandh). డైరెక్టర్ ప్రశాంత్ (Prashanth Neel) నీల్ అద్బుతంగా కేజీఎఫ్ 2ను తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు.

    సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతి సీన్ అదిరిపోయిందన్నాడు.  సినిమా చూస్తున్నంతసేపు చూపు తిప్పుకోలేమన్నారు. ఈ సినిమా ఓ టైఫూన్‌కు సమానంగా ఉంటుందన్నారు. కేజీఎఫ్‌ 2 కేవలం శాండల్‌వుడ్‌ బాక్ల్‌బస్టర్‌ మాత్రమే కాదు.. ఇదొక వరల్డ్‌ క్లాస్‌ మూవీ. యశ్‌, సంజయ్‌ దత్‌లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్‌ అయితే అందరికి షాకిస్తుంది’అని ఉమైర్‌ సంధు చెప్పుకొచ్చాడు. యశ్‌తో పాటు ఈ సినిమాలో మిగతా నటులు కూడ అదరగొట్టారని కొనియాడారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని సంధు చెప్పకనే చెప్పేశారు.

    KGF 2 కన్నడ, తమిళం, తెలుగు, హిందీ మరియు మలయాళంలో 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. యష్, సంజయ్ దత్‌లతో పాటు శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేజీఎఫ్‌తో యష్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్(Prashanth Neel) సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాడు. దీంతో కేజీఎఫ్‌ 2 విడుదల కోసం సీనీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎలాంటి సంచనాలు సృష్టిస్తుంది? ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డుని బద్దలు కొడుతుందా? బాక్సఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కురిపిస్తుందా ? అనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

    Published by:Sultana Shaik
    First published:

    Tags: Kannada Cinema, KGF, KGF Chapter 2, Prashanth Neel, Sanjay Dutt, Yash

    ఉత్తమ కథలు