KGF Chapter 2 : భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్లో టాక్ తెచ్చుకుంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బద్దలు కొడుతూ కొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా బాహుబలి-2 (Baahubali 2) రికార్డును బ్రేక్ చేసిందని అంటున్నారు.
KGF Chapter | Yash : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టమీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ సినిమా. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ (Yash).. ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్లో టాక్ తెచ్చుకుంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బద్దలు కొడుతూ కొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా బాహుబలి-2 (Baahubali 2) రికార్డును బ్రేక్ చేసిందని అంటున్నారు. ఈ సినిమా ఇప్పటికే రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా.. తాజాగా కెజియఫ్ 2 బుక్ మై షో (Book my show) బుకింగ్స్‌లో అత్యధిక టికెట్లు కొనుగోళ్లు జరిపిన సినిమాగా ఆల్‌టైమ్ న్యూ రికార్డ్ సృష్టించింది. మొత్తం 17.1 మిలియన్ల టికెట్స్ అమ్మకాలు జరగడంతో ఇప్పటివరకూ ఉన్న బాహుబలి- 2 బుకింగ్స్ రికార్డ్‌ను కెజియఫ్ 2 బ్రేక్ చేసిందని తెలుస్తోంది. అయితే కలెక్షన్స్ విషయంలో మాత్రం బాహుబలి-2నే రూ.1,429.83కోట్లతో టాప్‌లో ఉందని తెలుస్తోంది.
ఇక కెజియఫ్ 2 కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా మొత్తం మీద 6 వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు 7వ వారంలో అడుగు పెట్టింది. మొత్తం మీద సినిమా 43 వరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 20 లక్షల షేర్ని 55 లక్షల రేంజ్లో గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవరాల్‌గా 43 రోజులు పూర్తీ అయ్యే సమయానికి ఈ సినిమా టోటల్‌గా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 84.08 కోట్ల షేర్‌ను 136.54 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక 43 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 600.52 కోట్ల షేర్ని 1229.15 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.
కెజియఫ్ రెండో పార్ట్ 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగగా 253.51 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ రేంజ్లో బహుబలి సిరీస్ తర్వాత ఈ సినిమానే ఆ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా మూడో పార్ట్ కూడా రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇక మూడో భాగంలో రాఖీ భాయ్ ఇంటర్నేషనల్ లెవల్లో పవర్ చూపించనున్నాడట. పార్ట్ 3లో (KGF Chapter 3) రాఖీ భాయ్ సామ్రాజ్యం అమెరికాలోనూ విస్తరించనుందని టాక్.
KGF ఛాప్టర్ 2 మరో రికార్డు (KGF Chapter 2 Photo : Twitter)
ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ (Sanjay Dutt), రవీనా టాండన్ పవర్ఫుల్ రోల్ ప్లే చేశారు. కన్నడ నటి శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటించారు. రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగండూర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇక కెజియఫ్ చాఫ్టర్ 3 ప్రాజెక్టు ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ చేస్తున్నారు. అది పూర్తవ్వగానే ఈ సినిమా ఉండనుందట.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.