Home /News /movies /

KGF CHAPTER 2 CRAZE PEEKS IN NEPAL AND LORRY BACKSIDE STICKER GOES VIRAL PK

KGF Chapter 2 craze in Nepal: నేపాల్ లారీపై ‘KGF’ పేరు.. దేశం కాని దేశంలో రాఖీ భాయ్ రచ్చ..

యశ్ (File/Photo)

యశ్ (File/Photo)

KGF Chapter 2 craze in Nepal: ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ (Bollywood)మాత్రమే కాదు మనం కూడా తలెత్తుకునేలా.. కాలర్ ఎగరేసేలా మన జెండాను బాహుబలి సినిమాతో (Bahubali)బాలీవుడ్ గడ్డపై పాతాడు రాజమౌళి. ఈ సినిమా తర్వాత వచ్చిన కెజియఫ్ (KGF) కూడా మన పవర్ ఏంటో చూపించింది.

ఇంకా చదవండి ...
ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ మాత్రమే. హిందీ సినిమాలను మాత్రమే ఓవర్సీస్‌లో కూడా ఇండియన్ సినిమాలుగా చూసేవాళ్లు. ప్రాంతీయ సినిమాలను కనీసం పట్టించుకునే వాళ్లు కూడా కాదు. కానీ ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమా చేసాడో అప్పట్నుంచే సౌత్ సినిమా దశ మారిపోయింది. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదు మనం కూడా తలెత్తుకునేలా.. కాలర్ ఎగరేసేలా మన జెండాను బాలీవుడ్ గడ్డపై పాతాడు రాజమౌళి. ఈ సినిమా తర్వాత వచ్చిన కెజియఫ్ కూడా మన పవర్ ఏంటో చూపించింది. సౌత్ సినిమా అంటే ఇదిరా అనేలా రాఖీ భాయ్ కూడా రచ్చ చేసాడు. ఇప్పుడు ఈ చిత్రం కేవలం ఇండియాలోనే కాదు బయట కూడా రచ్చ చేస్తుంది. కెజియఫ్ రేంజ్ నేషనల్ దాటి ఇంటర్నేషనల్‌కు చేరిపోయింది. ఈ సినిమా కోసం పక్క దేశాల్లో కూడా అభిమానులు వేచి చూస్తున్నారు. దీనికి ప్రూఫ్ కూడా ఉంది. తాజాగా కెజియఫ్ 2 కోసం నేపాల్ ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో ఓ లారీ వెనక ఉన్న రాతను చూస్తుంటే అర్థమవుతుంది.

జూలై 16న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాపై మన దేశంలో కాకుండా పక్క దేశాల్లో కూడా ఎంత క్రేజ్ ఉందో మాటల్లో చెప్పలేం. తాజాగా ఓ లారీ వెనక కెజియఫ్ 2 కమింగ్ సూన్ అని రాసుంది. అది ఇండియాలో అయితే ఎలాంటి విశేషం లేదు.
KGF Chapter 2,KGF Chapter 2 movie release date,KGF Chapter 2 yash,KGF Chapter 2 nepal lorry,KGF Chapter 2 sticker lorry backside in Nepal,telugu cinema,కెజియఫ్ ఛాప్టర్ 2,కెజియఫ్ 2 సినిమా,నేపాల్‌లో కెజియఫ్ 2 ఛాప్టర్ క్రేజ్
కెజియఫ్ ఛాప్టర్ 2 (KGF Chapter 2)

ఎందుకంటే అక్కడ కెజియఫ్ సినిమాకు ఆ రేంజ్ క్రేజ్ ఉంది కాబట్టి. కానీ ఇది నేపాల్‌లో జరిగింది.. అక్కడ లారీ వెనుక భాగంలో కెజియఫ్ 2 కమింగ్ సూన్ అంటూ స్టిక్టర్ వేయించాడు. ఇది చూసిన తర్వాత ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మన సినిమాలు నేపాల్‌లో విడుదల అవుతుంటాయి. అక్కడ వాళ్ల సినిమాల కంటే మన ఇండియన్ సినిమాలకే ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. ఈ క్రమంలోనే నేపాలీలు కెజియఫ్ ఛాప్టర్ 2 కోసం వేచి చూస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: KGF Chapter 2, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు